Kerala: కేంద్రమంత్రి ఇంటిపై రాళ్ల దాడి, కిటికీలు ధ్వంసం - నిందితుడు అరెస్ట్
Kerala News: కేరళలోని కేంద్రమంత్రి మురళీధరన్ ఇంటిపై రాళ్ల దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![Kerala: కేంద్రమంత్రి ఇంటిపై రాళ్ల దాడి, కిటికీలు ధ్వంసం - నిందితుడు అరెస్ట్ Kerala Man Arrested For Pelting Stones At Union Minister Muraleedharan's Residence In Thiruvananthapuram Kerala: కేంద్రమంత్రి ఇంటిపై రాళ్ల దాడి, కిటికీలు ధ్వంసం - నిందితుడు అరెస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/24f723be01644cd1f07339bce5d58ad41676189689644517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Union Minister Muraleedharan:
కేంద్ర మంత్రి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని విదేశీ వ్యవహారాల మంత్రి వి మురళీధరన్ ఇంటిపై కొద్ది రోజుల క్రితం రాళ్ల దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు రాళ్లు విసిరాడు. ఈ దాడిలో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చివరకు కేరళ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 45 ఏళ్ల మనోజ్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. మంత్రి ఇంట్లో పని చేసే వ్యక్తులు కిటికీ పగిలిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక టీమ్‌తో విచారణ జరిపించారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు.
"ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. కేంద్రమంత్రి ఇంటిపై దాడి ఎందుకు చేశారో కనిపెడతాం. ఆరోజు ఏం జరిగిందో పూర్తి వివరాలు త్వరలోనే అందిస్తాం"
-పినరయి విజయన్, కేరళ సీఎం
Kerala | A man named Manoj, 45, arrested by police for pelting stones at the residence of union minister V Muraleedharan: Medical college Police, Thiruvananthapuram
— ANI (@ANI) February 12, 2023
A window pane of union minister V Muraleedharan’s house in Ulloor was found vandalised last Thursday.
Kerala | Stones pelted by unidentified people at the house of Union Minister V Muraleedharan in Thiruvananthapuram. Police investigation underway. pic.twitter.com/ap0RBzL1OW
— ANI (@ANI) February 9, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)