Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌కు రిలీఫ్- ఆ కేసులో ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే!
Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌పై నమోదైన ఓ చీటింగ్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే విధించింది.
![Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌కు రిలీఫ్- ఆ కేసులో ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే! Kerala High Court Stays Criminal Proceedings Against Actor Sunny Leone In Cheating Case Sunny Leone Cheating Case: సన్నీ లియోన్‌కు రిలీఫ్- ఆ కేసులో ప్రొసీడింగ్స్‌పై కేరళ హైకోర్టు స్టే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/262e03eaa03a32d85cc5bec511ab94a71668583574988218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sunny Leone Cheating Case: చీటింగ్ కేసులో నటి సన్నీ లియోన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ సహా మరో వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ కేసు
సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ సహా మరో ఉద్యోగిపై కేరళకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ ఈ కేసు పెట్టారు. లక్షల్లో భారీ మొత్తం చెల్లించినప్పటికీ సన్నీ లియోన్ ఒక ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి రాలేదని ఆయన ఆరోపించారు.
దీంతో సన్నీలియోన్ సహా మరో ఇద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read: UK Visa: మోదీతో భేటీ తర్వాత- భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి సునక్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)