Breaking News Telugu Live Updates: జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు
AP Telangana Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
![Breaking News Telugu Live Updates: జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు Breaking News Telugu Live Updates: జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/11/277cdd11a000f31b35eb8be8c23431eb_original.jpg)
Background
నైరుతి రుతుపవనాలు గత ఏడాది కంటే ముందే కేరళను తాకాయి. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో ఏపీలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మరికొన్ని గంటల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ కేంద్రం ప్రకటించనుంది. ప్రస్తుతం మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, దక్షిన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు రావడానికి మరో మూడు, నాలుగు రోజులు సమయం పట్టనుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పతనమైంది. రూ.210 మేర తగ్గడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100కి పతనమైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గడంతో నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 కి క్షీణించింది. రూ.1,000 మేర తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్‌లో నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 11th June 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో శనివారం పెట్రోల్ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.56 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 45 పైసలు పెరగడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.84 కాగా, 42 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.98 అయింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 69 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.84 కాగా, డీజిల్‌పై 65 పైసలు పెరిగి లీటర్ ధర రూ.99.85 అయింది. విజయవాడలో ఇంధన ధరలు పెరిగాయి. 21 పైసలు పెరగడంతో ఇక్కడ పెట్రోల్ (Petrol Price in Vijayawada 11th June 2022) లీటర్ ధర రూ.111.54 కాగా, 19 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.31 అయింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. దాంతో తిరుమలలో భక్తులతో కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. దాంతో బయట సైతం క్యూ లైన్స్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి దాదాపు 25గంటలు పట్టే అవకాశం ఉంది స్వయంగా టీటీడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో శ్రీవారి భక్తులు అర్థం చేసుకోవచ్చు.
తిరుమలలో శనివారం నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనార్థం భక్తులు రాంభగీచా అతిథి గృహాలు వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి కనీసం ఒకరోజు సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని 67,949 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకలు, విరాళాల రూపంలో నిన్ని ఒక్కరోజు శ్రీవారి హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
జర్నలిస్టు పై దాడిని ఖండించిన పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
పెద్దపల్లి జిల్లా... గోదావరిఖనిలో జర్నలిస్టు పై దాడిని ఖండించిన పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
దాడికి పాల్పడ్డ కార్పోరేటర్ ను మరో ముగ్గురు ని టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటన.
ఇక నుంచి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన, ప్రజా జీవనాన్ని భంగం కలిగించేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్యకర్తలను హెచ్చరించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చందర్.
Jubilee hills Minor girl case: జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు
జువైనల్ హోమ్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి మైనర్ నిందితులు
నిందితులందరికి ఉస్మానియ లోని ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు
డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య బృందం సాదిద్దున్ మాలిక్ తో పాటు ఐదుగురు మైనర్ నిందుతులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు ప్రయివేట్ కార్లలో నిందితుల్ని ఉస్మానియ కు తీసుకువచ్చిన పోలీసులు.
ముఖాలకు మాస్కులు వేసి ఒక్కోకరిని ఫోరెన్సిక్ విభాగంలోకి తరలిస్తోన్న పోలీసులు
ఈ వైద్య పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టే అవకాశం
వైద్య పరీక్షల అనంతరం జూబ్లీహిల్స్ పీఎస్ కు ఆరుగురు నిందితులు
Viveka Murder Case: గంగాధర రెడ్డి మృతి పై సీబీఐ దర్యాప్తు చెయ్యాలి: మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
గతంలో పరిటాల హత్య కేసు నిందితులు కూడా ఇలానే చనిపోయారు. ఎన్నికల సమయంలో సింపతీ కోసం జగన్ సీబీఐ దర్యాప్తు కావాలన్నారు. అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సొంత బాబాయ్ గొడ్డలి దెబ్బతో చనిపోయి ఉంటే.. తన జైల్ మేట్ విజయ సాయి రెడ్డి ని పంపించి అది గుండెపోటు చావు అని చెప్పించాడని ఆరోపించారు. తరువాత వివేకా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల హత్య అని ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో సింపతీ కోసం జగన్ సీబీఐ దర్యాప్తు కావాలన్నారు. అధికారంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు. జగన్ కు వివేకా కుమారై ఎంతో.. అవినాష్ రెడ్డి కూడా అంతే కదా.. మరి ఆమెకు అన్యాయం చేస్తూ.. అవినాష్ రెడ్డి ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో సాక్షులు ఒకొక్కరు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. 40-45 ఏళ్ల వ్యక్తి రాత్రికి రాత్రే చనిపోవడం ఏంటని ప్రశ్నించారు. గంగాధర రెడ్డి మృతి పై సీబీఐ దర్యాప్తు చెయ్యాలి. గతంలో పరిటాల హత్య కేసు నిందితులు కూడా ఇలానే చనిపోయారు. అప్పట్లోనే పరిటాల హాత్యలో జగన్ పాత్ర ఉందని మేము ఆరోపించాం. వివేకా హత్య వల్ల ఎవరికి లాభమో అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కు తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు కు సహకరించమని అడిగినా జగన్ ఏమాత్రం సహకరించలేదు. సునీతా రెడ్డికి.. ఆమె భర్తకు ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు.
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి.. వైఎస్ వివేకా కుటుంబీకులకు ఏదైనా జరగొచ్చు. అలా హాని చేసి వాటిని టీడీపీ మీదకు నెట్టొచ్చు. అందుకే వెంటనే సునీత రెడ్డికి..ఆమె భర్తకు రక్షణ కల్పించాలి. వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం చెయ్యకపోతే మరిన్ని హత్యలు జరగొచ్చు. ఇవన్నీ అనుమానాస్పద చావులు. పరిటాల హత్య చేయించిన వాళ్ళూ..వివేకా హత్య చేసిన వాళ్ళూ ఒకరే. వివేకా హత్య కేసులో అసలు దోషులను బయట పెట్టడం తో పాటు.. సునీతా రెడ్డి కుటుంబీకులకు రక్షణ కల్పించాలని సీబీఐకి విన్నవించు కుంటున్నాం. లోకేష్ కి z కేటగిరీ ప్రొటెక్షన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
Mangalagiri AIMS: మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కు కేంద్ర వైద్య శాఖ మంత్రి ప్రవీణ్ పవార్
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కు కేంద్ర వైద్య శాఖ మంత్రి ప్రవీణ్ పవార్ చేరుకున్నారు. ఎయిమ్స్ సందర్శించి పరిశీలించిన కేంద్ర మంత్రి .. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై సమీక్ష చేస్తున్నారు. నిధుల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన. ఆయుష్మాన్ భారత్, ఇతర పథకాల కింద వచ్చిన నిధులపై చర్చ. పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రుల్లో వసతులను కేంద్ర మంత్రి పరిశీలిస్తున్నారు.
KTR Launches cable bridge: లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అష్టలక్ష్మి అమ్మవారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను కేటీఆర్ ప్రారంభించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)