(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka: సిద్దరామయ్యకి బిగ్ రిలీఫ్, ల్యాండ్ స్కామ్ కేసులో చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి హైకోర్టు ఊరటనిచ్చింది. ల్యాండ్ స్కామ్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Land Scam Row: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి భూ కుంభకోణం కేసులో హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"ప్రస్తుతం ఈ కేసుని ఈ కోర్టు విచారిస్తోంది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా జరగాల్సి ఉంది. తదుపరి విచారణ వరకూ ట్రయల్ కోర్టు సిద్దరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు"
- కర్ణాటక హైకోర్టు
Karnataka High Court posts the hearing on August 29 the plea of Chief Minister Siddaramaiah challenging the sanction for his prosecution in the alleged MUDA land allotment scam, and asks the concerned lower court to defer all proceedings.
— ANI (@ANI) August 19, 2024
(File photo) pic.twitter.com/pYAdbuSrAX
ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు మాత్రం సిద్దరామయ్యకి సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. MUDA స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే సిద్దరామయ్య తేల్చి చెప్పారు. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఆగస్టు 17న సిద్దరామయ్యపై చర్యలకి గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపించారు. ఇది అనైతికమని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సిద్దారమయ్య తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడంలో అర్థం లేదని వాదించారు. (Also Read: Viral Video: రెండో అంతస్తు నుంచి మీద పడిన ఏసీ, విలవిలలాడి అక్కడికక్కడే వ్యక్తి మృతి - వీడియో)
ఏంటీ స్కామ్..?
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కేసరు గ్రామంలో సిద్దరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల స్థలం ఉంది. దీన్ని MUDA అక్వైర్ చేసుకుంది. ఇందుకు బదులుగా మరో చోట 14 స్థలాలు పరిహారంగా ఇచ్చారు అధికారులు. అయితే..MUDA సేకరించిన స్థలం ధరతో పోల్చితే పరిహారంగా ఇచ్చిన స్థలాల విలువ ఎక్కువని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
Also Read: Kolkata: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?