By: Ram Manohar | Updated at : 06 Apr 2023 12:43 PM (IST)
కర్ణాటక కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Karnataka Elections 2023:
42 మంది పేర్లు ఖరారు..
కర్ణాటక కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఇప్పటికే 124 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ఆ పార్టీ..ఇప్పుడు రెండో విడత జాబితా విడుదల చేసింది. ఎన్నికల బరిలోకి దిగనున్న 42 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగిన తరవాత ఈ జాబితా విడుదల చేశారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే పోటీ చేసే అవకాశమిస్తున్నట్టు ఖర్గే స్పష్టం చేశారు. గెలవకపోయినా... ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలిగే వారినే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. మొదటి విడత జాబితాలో డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా అదే స్థానాన్ని ఖరారు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అన్న విషయంలో మాత్రం అధిష్ఠానం క్లారిటీ ఇవ్వడం లేదు. కొన్ని వర్గాలు సిద్దరామయ్య పేరు చెబుతుండగా...మరి కొందరు డీకే శివకుమార్ పేరు ప్రస్తావిస్తున్నారు.
Congress releases second list of 42 candidates for Karnataka Assembly elections pic.twitter.com/wzpumgNTf3
— ANI (@ANI) April 6, 2023
సీఎం సీట్ కోసం ఫైట్..
దక్షిణాదిలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడి నుంచి మిగతా దక్షిణాది రాష్ట్రాలకూ తమ పార్టీని విస్తరించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది అధిష్ఠానం. అయితే...ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం బసవరాజు బొమ్మైపై కొంత అసహనం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ABP CVoter ఒపీనియన్ పోల్‌లోనూ ఇదే వెల్లడైంది. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆ పార్టీలో మళ్లీ చీలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. అంతర్గత కలహాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ అధిష్ఠానం. కర్ణాటకలో విజయావకాశాలున్నాయని సంబర పడుతున్న సమయంలో మళ్లీ ఇవే విభేదాలు మొదలైనట్టు సంకేతాలొస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిపై రగడ మొదలైంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే...మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఈ రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థిగానే నిలబడాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలను వేడెక్కించాయి. మరోసారి కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అన్న అనుమానాలకు దారి తీస్తున్నాయి.
Also Read: Covid-19 Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, అలెర్ట్ అయిన రాష్ట్రాలు - పలుచోట్ల ఆంక్షలు
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?
WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్వాడీ పోస్టులు, వివరాలు ఇలా!
TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టులు
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam