Karnataka Election Results 2023: విద్వేషంతో కాదు ప్రేమతో గెలిచాం, ఇది పేద ప్రజల విజయం - రాహుల్ గాంధీ
Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు.
Karnataka Election Results 2023:
విద్వేష రాజకీయాల్ని తిప్పికొట్టారు: రాహుల్
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు కనీసం 20 సీట్లు ఎక్కువగానే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 135 సీట్లకు పైగా లీడ్‌లో ఉంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. భారీ మెజార్టీ ఇచ్చినందుకు కర్ణాటక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్వేష రాజకీయాల్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ...ఇది ప్రజల విజయం అని అన్నారు.
"ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా అభినందనలు. కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలవైపు నిలబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే...ఈ సారి మేం ద్వేషంతో పోటీ చేయలేదు. ప్రేమతోనే పోటీ చేశాం. దేశ ప్రజలంతా ప్రేమ పూరిత రాజకీయాలనే కోరుకుంటున్నారని కర్ణాటక ప్రజలు నిరూపించారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రేమపూర్వక రాజకీయాలకే ఓటు వేశారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం. మొదటి రోజు నుంచే ఈ పని మొదలు పెడతాం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
#WATCH | "Karnataka mein Nafrat ki bazaar band hui hai, Mohabbat ki dukaan khuli hai": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls pic.twitter.com/LpkspF1sAz
— ANI (@ANI) May 13, 2023
#WATCH | "Poor people defeated crony capitalists in Karnataka. We didn't fight this battle using hatred...": Congress leader Rahul Gandhi on party's thumping victory in #KarnatakaPolls #KarnatakaElectionResults pic.twitter.com/KKSiV2Lxye
— ANI (@ANI) May 13, 2023
ఆర్బీఐ మాజీ గవర్నర్ కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు. విద్వేష రాజకీయాలను, అవినీతిని ఓడించిన కన్నడిగులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఓటు వేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.
Thank you Kannadigas for defeating Hubris, Hatred and corruption. And embracing Brotherhood, Kannada Pride and Progress! #KarnatakaLandslide pic.twitter.com/JGr555dr2e
— Raghuram Rajan (@ArunSFan) May 13, 2023
రేపు (మే 14)వ తేదీన సీఎల్పీ సమావేశం జరగనుంది. బెంగళూరు వేదికగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఈ రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. ఈ భేటీ పూర్తైన తరవాత సీఎం ఎవరన్నది ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయకుండా జాగ్రత్త పడుతోంది. గెలిచిన వారిని కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ..కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. బెంగళూరుకు ఇద్దరు కీలక నేతల్ని పంపించి ప్రస్తుత పరిస్థితులపై నిఘా పెడతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలిస్తోంది. అక్కడ ఇక రిసార్ట్ రాజకీయాలు మొదలు కానున్నాయి.
Also Read: Karnataka Election Results 2023: సౌత్ పల్స్ పట్టుకోలేకపోతున్న బీజేపీ, బీజేపీ ముక్త్ సౌత్ స్లోగన్‌తో కాంగ్రెస్ కౌంటర్