Kamal Haasan Rajya Sabha: రాజ్యసభకు లోకనాయకుడు కమల్ హాసన్ -డీఎంకే కూటమి నుంచి అభ్యర్థిగా ప్రకటన
Kamal: కమల్ హాసన్ ను డీఎంకే కూటమి తరపున రాజ్యసభకు వెళ్తున్నారు. ఆయన పోటీ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Kamal Haasan is going to Rajya Sabha: లోకనాయకుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్తున్నారు. ప్రస్తుతం ాయన మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. డ్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం ఆయనకు రాజ్యసభ ఇస్తున్నారు. తమిళనాడులో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో నాలుగు డీఎంకే కూటమికి వస్తాయి. ఒక సీటును కమల్ హాసన్‌కు కేటాయించారు. '
పార్టీ పెట్టినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన కమల్ హాసన్
కమల్ హాసన్ 2018 ఫిబ్రవరి 21న మదురైలో మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేసింది. అయితే 3.72 శాతం ఓటు బ్యాంక్ మాత్రమే వచ్చింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. DMK నేతృత్వంలోని INDIA కూటమికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, DMK 2025 రాజ్యసభ ఎన్నికల్లో MNMకు ఒక సీటు కేటాయించడానికి అంగీకరించింది. కమల్ హాసన్ తమిళనాడు , పుదుచ్చేరిలోని 39 లోక్‌సభ స్థానాల్లో DMK కూటమి కోసం ప్రచారం చేశారు.
గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకే కూటమికి సపోర్టు
కమల్ హాహన్‌కు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లుగా 2024 మార్చి 9న చెన్నైలోని DMK ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కమల్ హాసన్ , DMK అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం .కె. స్టాలిన్ ప్రకటించారు. అప్పట్లో ఎలాంటి రాజ్యసభ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు జూలై 24న తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో DMK నేతృత్వంలోని INDIA కూటమికి 158 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కమల్ రాజకీయంగా త ఎక్కువ ప్రభావం చూపించలేకపోయారు. పార్టీ పెట్టిన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
@ikamalhaasan
— We Dravidians (@WeDravidians) May 28, 2025
Congratulations Dr. Kamal Haasan 🎉
Your intelligence, vision, eloquence, dedication, and sincerity are exactly what this nation needs. 🇮🇳
May your voice rock the parliament and your questions move the nation forward. ✊#RajyaSabha #ParliamentVoices… pic.twitter.com/bwLMXPxpts
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం
ఈ సంవత్సరం పార్లమెంట్‌లో, వచ్చే ఏడాది అసెంబ్లీలో మా గొంతు వినిపిస్తామని ఇటీవల ప్లీనరీలో కమల్ హాసన్ ప్రకటించారు. తమిళనాడులో ఆరు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు ఎన్నికలు జూన్ 19 న జరగనున్నాయి





















