అన్వేషించండి

kannada Tamil: కన్నడ, తమిళ్ మధ్య చిచ్చు పెట్టిన కమల్ హాసన్ - ఇలా ఎలా చెప్పారు?

Kamal Controversy : తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్ వ్యాఖ్యానించారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kannada was born from Tamil: తమిళనాడు, కర్ణాటకలో  భాషా వివాదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ రెండు భాషలు ఎక్కువగా హందీనే టార్గెట్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు తమిళం, కన్నడం మద్య పంచాయతీని కమల్ హాసన్ పెట్టారు.   చెన్నైలో జరిగిన తన కొత్త చిత్రం *థగ్ లైఫ్* ఆడియో విడుదల కార్యక్రమంలో "కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టిందని " ప్రకటించారు.  కమల్ తన ప్రసంగంలో " నా జీవనం, నా కుటుంబం తమిళం అని చెప్పారు. తరవాత అదే వేదికపై ఉన్న  కన్నడ  సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వైపుచూస్తూ..  మీ భాష కన్నడ తమిళ్ నుంచి జన్మించింది, కాబట్టి మీరు కూడా  తమిళ కుటుంబంలో భాగమే అని చెప్పారు. కమల్ మాటలు వైరల్ అయ్యాయి.  

 
కమల్ హాసన్ వ్యాఖ్యలను  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు, "కన్నడ భాషకు 2,500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందన్నారు.  కమల్‌కు ఈ విషయం తెలియదన్నారు.  

బీజేపీ నాయకుడు బి.వై. విజయేంద్ కూడా కమల్ వ్యాఖ్యలను  అహంకారం గా అభివర్ణించారు. కన్నడ భాషను అవమానించడం ద్వారా 6.5 కోట్ల కన్నడిగుల స్వాభిమానాన్ని గాయపరిచారని, కమల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతను కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ, కన్నడిగుల పట్ల "కృతఘ్నత" చూపాడని ఆరోపించారు. 

ఇక కన్నడ ఉద్యమ సంస్థలు తెరపైకి వచ్చాయి.  కన్నడ రక్షణ వేదిక మల్ వ్యాఖ్యలను అవమానకరంగా ఉన్నాయన్నారు.  కర్ణాటకలో వ్యాపారం చేయాలనుకుంటే, కన్నడాన్ని అవమానించడం మానుకో  అని కన్నడ రక్షణ వేదిక కమల్‌ను హెచ్చరించింది.  బెంగళూరులో *థగ్ లైఫ్* బ్యానర్లను చించివేసి, కమల్‌పై నల్ల సిరా వేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తప్పించుకున్నాడన్నారు. 

తమిళనాడు బీజేపీ నేత  తమిళిసై సౌందరరాజన్ కూడా కమల్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.  భాషల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని..  కమల్ హాసన్ డీఎంకేను సంతోషపెట్టడానికి ఇతర భాషలను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.  కన్నడ సోషల్ మీడియాలో *థగ్ లైఫ్* చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపులు వచ్చాయి. కొందరు కన్నడ భాషకు 56 అక్షరాలు ఉండగా, తమిళంలో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయని, కన్నడం తమిళం నుంచి జన్మించలేదని  వాదిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
Indiramma Housing Scheme: హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం
హైదరాబాద్‌లో ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు.. 4 చోట్ల టవర్లు నిర్మించనున్న ప్రభుత్వం
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget