News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Judge Romance In Jail : జైలు గదిలో ఖైదీతో మహిళా జడ్జి ముద్దు ముచ్చట్లు ! వీడియో బయటకు వస్తే ఊరుకుంటారా ?

ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో అదే కేసు విచారణ జరిపిన మహిళా న్యాయమూర్తి జైలు గదిలో రొమాన్స్ చేస్తూ దొరికిపోయారు. సీసీ టీవీ ఫుటేజీ బయటకు రావడంతో విచారణ జరుపుతున్నారు.

FOLLOW US: 
Share:

" ఓ జైలు గది. అందులో ఓ మహిళ, ఖైదీ ముద్దులాడుకుంటున్నారు. కొంత విరామం తర్వాత కలుసుకున్న ప్రేమికుల్లాగా మూతి ముద్దులు కూడా పెట్టుకున్నారు. కాసేపు ఆ రొమాన్స్ సాగింది." ఇంతలో ఆ వీడియో అయిపోయింది. ఇది సినిమాలో సీన్ కాదు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం. ఇప్పుడీ దృశ్యం ఆ దేశంలో సంచనలం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆ జైల్లో ఉన్న ఖైదీ పోలీసును హత్య చేసిన హంతకుడు. ఆతడితో రొమాన్స్ చేస్తున్న మహిళ .. ఓ న్యాయమూర్తి. ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందో తెలియక జైలు అధికారులు కిందా మీదా పడుతున్నారు. కానీ ఆ వీడియోను మాత్రం వాళ్లతో సహా అందరూ పదే పదే చూస్తున్నారు. 

Also Read: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!

అర్జెంటీనాలో ఓ పోలీస్‌ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ బస్టోస్‌ జైలులో ఉన్నారు. 2009లో పోలీస్‌ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్‌ హత్య చేశాడు. అతను చేసిన నేరం నిరూపణ అయింది. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్‌ లో మారియల్ అనే న్యాయమూర్తి కూడా ఉన్నారు. విచారణ సమయంలో బస్టోస్‌కు యావజ్జీవ శిక్ష వేయవద్దని ఆమె ఓటు వేశారు. కానీ మిగిలిన వాళ్లంతా యావజ్జీవ శిక్ష వేయాల్సిందేనని తేల్చడంతో బస్టోస్‌కు జీవితాతం జైల్లో ఉండే శిక్ష పడింది.

Also Read: Paytm Shares Down: ఇదేంది సామి!! 50% పతనమవ్వనున్న పేటీఎం షేరు! రూ.900కి వస్తుందంటున్న బ్రోకరేజ్‌ సంస్థలు

ఆ తరవాత  మారియల్ జైలుకు వెళ్లి బస్టోజ్‌తో ములాఖత్ అయింది. ఈ ములాఖత్‌లోకి ముద్దులు కూడావచ్చాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి  మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని అక్కడి సుప్రీంకోర్టు తెలిపింది. అంతకు ముందు వీరికి పరిచయం ఉందా.. లేకపోతే విచారణ సమయంలోనే మహిళా న్యాయమూర్తి హంతకుడి పట్ల ఆకర్షితురాలయిందా అన్నదానిపై ఇప్పటికైతే పరిశోధన జరుగుతోంది. కానీ వారి లవ్ స్టోరీ మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: యముడు లీవ్‌లో ఉంటే ఇంతే.. జెట్ స్పీడ్‌తో బస్సు మీదకు దూసుకొచ్చాడు, కానీ..

Published at : 13 Jan 2022 05:35 PM (IST) Tags: Argentina Judge romances with prisoner Romance in prison cell Prisoner kisses with female judge

ఇవి కూడా చూడండి

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Mazagon, Tata Moto, REC, Blue Dart

Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Mazagon, Tata Moto, REC, Blue Dart

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా?, డూప్లికేట్‌ సంపాదించడానికి సులభమైన దార్లున్నాయి!

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా?, డూప్లికేట్‌ సంపాదించడానికి సులభమైన దార్లున్నాయి!

Stock Market Update: అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

Stock Market Update: అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ