Joshimath Crisis: జోషిమఠ్‌పై మీడియాతో మాట్లాడొద్దు, సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వద్దు - ప్రభుత్వ ఆదేశాలు
Joshimath Crisis: జోషిమఠ్‌పై మీడియాతో మాట్లాడొద్దని ఇస్రోకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
![Joshimath Crisis: జోషిమఠ్‌పై మీడియాతో మాట్లాడొద్దు, సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వద్దు - ప్రభుత్వ ఆదేశాలు Joshimath Crisis After ISRO Images NDMA Orders No Interaction With Media opposition Calls It Gag Order Know Details Joshimath Crisis: జోషిమఠ్‌పై మీడియాతో మాట్లాడొద్దు, సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వద్దు - ప్రభుత్వ ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/15/e6a2aff51b84cea1af269dff16cee3e91673769435532517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Joshimath Crisis:
ఇస్రో ఇమేజ్‌ల సంచలనం..
జోషిమఠ్‌లోని స్థితిగతులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ ఊరు ఊరే త్వరలోనే కుంగిపోతుందని ఇటీవలే ISRO తేల్చి చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్‌తో సహా వివరించింది. దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే National Disaster Management Authorityతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్రోతో పాటు రాష్ట్రానికి చెందిన ఏ సంస్థైనా...ఈ విషయమై మీడియాతో మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకూడదని ఆదేశించింది. జోషిమఠ్ పరిస్థితులపై సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్‌లు పెట్టకూడదని తెలిపింది. అనుమతి లేకుండా వివరాలు పంచుకోవద్దని పేర్కొంది. గత వారం ఇస్రో జోషిమఠ్ పరిస్థితులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలువరించింది. గతేడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలంలో జోషిమఠ్ 5.4 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని వివరించింది. అయితే...దీనిపై ఉత్తరాఖండ్ మంత్రి ధన్‌సింగ్ రావత్ అసహనం వ్యక్తం చేశారు. ఇస్రో విడుదల చేసిన చిత్రాలను "విత్‌డ్రా" చేసుకున్నట్టు వెల్లడించారు. ఆ తరవాతే "మీడియాతో" మాట్లాడొద్దన్న ఆదేశాలు వచ్చాయి. జోషిమఠ్ పనుల్లో పాలు పంచుకుంటున్న వాళ్లు కూడా మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పారు అధికారులు. ఈ ఆర్డర్‌పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో అందరి గొంతు నొక్కేస్తున్నారని విమర్శిస్తున్నాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. "జోషిమఠ్‌లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ప్రయత్నమిది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is literally a gag order to not let the country know what’s happening in Joshimath, only what government wants you to know. Being the Master’s Voice. pic.twitter.com/fqAKZgQqSa
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 14, 2023
జనవరి 2న అక్కడ కొండ చరియలు విరిగి పడ్డాయని చెప్పింది ఇస్రో. అయితే దీనిపై సంక్షోభం రోజురోజుకు పెరుగుతున్న వేళ ఈ నివేదికను ఇస్రో తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. జోషిమఠ్ లోని పరిస్థితి తీవ్రతను ఈ నివేదిక సూచించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇక్కడి భూమి 5 సెం.మీ. కుంగినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు సంస్థ వెబ్ సైట్ లో ఈ నివేదిక కనిపించడంలేదు. అలాగే దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ పనిచేయడం లేదు. ఇస్రో నివేదిక ప్రకారం... ఏప్రిల్, నవంబర్ 2022 మధ్య 7 నెలల కాలంలో జోషిమఠ్ నగరం 9 సెంటీమీటర్ల వరకు భూమి క్షీణించింది. గత 12 రోజుల్లో ఇక్కడ కొండచరియలు విరిగిపడ్డాయని సమాచారం. ఇక్కడ నివసించడం సురక్షితం కాదని కొందరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)