అన్వేషించండి

Joe Biden: భార్య అనుకుని వేరే మహిళకు ముద్దు పెట్టబోయిన బైడెన్ - వీడియో వైరల్

Viral Video: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తన భార్య అనుకుని వేరే మహిళను ముద్దాడబోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Joe Biden Kiss Another Woman Mistaking Her For Wife: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియడం లేదు. ఆయన ఏ స్టేజ్‌ ఎక్కినా సరే అదో సెన్సేషన్ అయిపోతోంది. ఒక్కోసారి ఫ్రీజ్ అయిపోవడం, ఎటువైపో చూస్తుండడం లాంటివి చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వయసులో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ కొందరు మండి పడుతున్నారు. మరి కొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలున్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి చాలానే డిస్కషన్ జరుగుతోంది. పైగా ఆయనకు కొవిడ్ కూడా సోకింది. అయితే...సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ స్టేజ్‌పైన ఉన్న జో బైడెన్‌ పక్కనే ఉన్న మహిళతో మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి కాస్త ముందుకు జరిగారు. ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఆయన భార్య జిల్ బైడెన్‌ వచ్చారు. భార్యే అనుకుని మరో మహిళకు ముద్దు పెట్టబోతుండగా జిల్ బైడెన్ వచ్చారు. పాత వీడియోనే అయినా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. జిల్ బైడెన్ రాకపోయుంటే బహుశా ఆ మహిళకు బైడెన్ ముద్దు పెట్టే వారేమో. ఈ వీడియో చూసిన నెటిజన్లు బైడెన్‌ని తిట్టి పోస్తున్నారు. న్యూక్లియర్ బాంబు బటన్‌లు చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నాడంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ప్రవర్తన అంత ప్రమాదకరంగా మారిపోయిందని మండి పడుతున్నారు. 

గతంలోనూ చాలా సందర్భాల్లో బెడైన్ ఇలాంటి ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. ఓ సారి స్టేజ్‌ ఎక్కిన సమయంలో చనిపోయిన అధికారి పేరు పిలిచి అందరినీ షాక్‌కి గురి చేశారు. తరవాత ఎవరో జోక్యం చేసుకుని విషయం గుర్తు చేశారు. అప్పటికి కానీ బైడెన్ తేరుకోలేదు. ఆ తరవాత మరో కార్యక్రమంలో స్టేజ్‌ దిగి ఎటువైపో నడుచుకుంటూ వెళ్లిపోయారు. సెక్యురిటీ ఆయనను అలెర్ట్ చేసింది. ఇక ఇటీవల ఇటలీలో జరిగిన G7 సదస్సులోనూ జో బైడెన్ వైఖరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచదేశాధినేతలంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగుతుంటే బైడెన్ మాత్రం ఎక్కడో దూరంగా నిలబడిపోయారు. అక్కడే ఫ్రీజ్ అయ్యారు. ఇది గమనించిన ఇటలీ ప్రెసిడెంట్ మెలోని ఆయన చేయి పట్టుకుని ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ముందు నుంచీ తేల్చి చెప్పిన బైడెన్ ఆ తరవాత కాస్త అసహనం వ్యక్తం చేశారు. మరీ మంచం మించి లేవలేనంతా పరిస్థితి దిగజారితే అప్పుడు తప్పుకుంటానని సంకేతమిచ్చారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఇక ఆయన ప్రెసిడెంట్ రేస్ నుంచి తప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బైడెన్ మాత్రం తాను ఫిట్‌గా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదని మీడియాకి వెల్లడించారు. అటు ట్రంప్ మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇటీవల జరిపిన కొన్ని సర్వేలూ ట్రంప్‌కి అనుకూలంగా ఉండడం వల్ల ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. 

Also Read: Donald Trump: దేవుడు తోడు, సెక్యూరిటీ సిబ్బంది తెగువతోనే మీ ముందుకొచ్చా- ట్రంప్ భావోద్వేగ ప్రసంగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget