News
News
X

Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు మళ్లీ కరోనా- కోలుకున్న 3 రోజులకే!

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా బారిన పడ్డారు.

FOLLOW US: 

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మరోసారి కరోనా వైరస్ సోకింది. కరోనా నుంచి కోలుకున్న మూడు రోజులకే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. దీంతో బైడెన్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

స్వల్ప లక్షణాలు

కొవిడ్‌ నుంచి బైడెన్‌ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఇటీవలే ప్రకటించింది. కానీ స్వల్ప లక్షణాలు ఉండటంతో మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌కు వెళ్లారు.

ఆయనకు స‍్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ వైద్యుడు కెవిన్‌ ఓ కానర్‌ తెలిపారు.

" 79 ఏళ్ల బైడెన్‌కు గత శనివారం నిర్వహించిన ఆంటిజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వరుసగా నాలుగు రోజులు నెగెటివ్‌గా తేలిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మళ్లీ ఐసోలేషన్‌ నిబంధనలు పాటిస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన లక్షణాలేమీ కనిపించలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. "
-కెవిన్‌ ఓ కానర్‌, డాక్టర్‌
 
ఇటీవల

అమెరికా- చైనా అధ్యక్షుల మధ్య ఇటీవల వర్చువల్ వేదికలో చర్చ జరిగింది. ఇందులో తైవాన్‌ ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైపీని సందర్శిస్తారనే వార్తలను దృష్టిలో పెట్టుకొని షీ జిన్‌పింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

" ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించకూడదు. ఒక వేళ మీరు నిప్పుతో చెలగాటం ఆడితో మీకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా "
-జిన్‌పింగ్‌, చైనా అధ్యక్షుడు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా గట్టిగానే సమాధానమిచ్చారని తెలుస్తోంది.

" తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న విషయాన్ని బైడెన్‌ గుర్తు చేశారు. కానీ, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్‌ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుంది.                         "
-అమెరికా వర్గాలు

Also Read: Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు- 'తగ్గేదేలే' అంటూ ట్వీట్

Also Read: Removing Condom During Sex: సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసినందుకు జైలు శిక్ష- కోర్టు సంచలన తీర్పు

Published at : 31 Jul 2022 01:22 PM (IST) Tags: Corona Joe Biden US President Biden

సంబంధిత కథనాలు

BSF Jobs:  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

SSC CHSL Final Answer Key 2021: సీహెచ్‌ఎస్‌ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!

SSC CHSL Final Answer Key 2021: సీహెచ్‌ఎస్‌ఎల్-2021 ఫైనల్ కీ వచ్చేసింది, ఇలా చూసుకోండి!

Bilkis Bano : "బిల్కిస్ బానో" కేసు దోషులందరూ రిలీజ్ - దేశవ్యాప్తంగా విమర్శలు !

Bilkis Bano :

టాప్ స్టోరీస్

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Milk Price  : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!

Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!