Japan restaurant: అరిటాకుల్లో విందు భోజనం - మట్టిపాత్రల్లోనే వంటకం - ఇక్కడైతే కామనే - కానీ జపాన్‌లో మరి !
Indian style : భారత సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఓ జపాన్ జంట అచ్చమైన భారత రెస్టారెంట్ ను ప్రారంభించారు. వారి డ్రెస్సింగ్ కూడా భారతీయుల్లాగే ఉంటుంది.

Indian style Japan restaurant: జపాన్‌లోని ఒక ప్రత్యేక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఓనర్లు భారతీయులు కాదు. జపానీయులే. కానీ వారు భారతీయ దుస్తులు ధరించి.. భారతీయ స్టైల్‌లో భారతీయ వంటకాలు అందిస్తూంటారు.
View this post on Instagram
రెస్టారెంట్ పేరు Indian Spice. టోక్యో (Tokyo)లో ఉంది. భారతీయులు ఎక్కువగా ఉన్న షిబుయా , అసకుసా ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. భారతీయ వంటకాలు మాత్రమే సర్వ్ చేసే చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్. ఓనర్ పేరు మిస్ యుకో . కానీ భారతీయ సంస్కృతి పట్ల ప్యాషన్ కలిగినవాళ్లు . ఆమె రెస్టారెంట్ సంప్రదాయ చీరకట్టులోనే కనిపిస్తారు. భారతీయ ఆభరణాలు బింది, జూమ్కా వంటివి పెట్టుకుని భారతీయ స్టైల్‌లో కస్టమర్లకు సర్వ్ చేస్తారు. ఈ రెస్టారెంట్ పెట్టే ముందు ఆమె భారతదేశానికి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి ప్రయాణాలు చేసి, అక్కడి వంటకాలను నేర్చుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకున్నారు.
ఈ రెస్టారెంట్ వీడియో వైరల్ అయింది. భారతీయ సంస్కృతి జపాన్‌లో ప్రమోట్ చేయాలని మిస్ యుకో భావిస్తున్నారు. రెస్టరెంట్ లో ఇడ్లీ, దోస (Dosa), సాంబార్, బిర్యానీ, పనీర్ టిక్కా వంటివి ఉంటాయి. మట్టి పాత్రల్లో వండుతారు. అరటిఆకు వడ్డిస్తారు. ఓనర్ సర్వ్ చేస్తూ "జై శ్రీ రామ్" లేదా "అమ్మా" అని పలకరిస్తూ ఉంటారు. విశేషం ఏమిటంటే ఇక్కడ భారతీయ వంటకాలను రుచి చూడటానికి జపనీయులు ఎక్కువ మందివస్తారు.
The Magic of Indian Culture in Japan!
— Ashish Pandey (@AshishPandeyH) August 22, 2025
A video is going viral on the internet showing a Japanese couple who, inspired by Kolkata and Indian culture, are running a restaurant in Japan that is completely based on an Indian theme.
🍲 Here, you can find all kinds of Indian dishes —… pic.twitter.com/5iiKm8dqTa
ఈ వీడియో భారతీయ సంస్కృతి జపాన్‌లో ప్రమోట్ అవుతున్నదని చూపిస్తుంది. జపాన్‌లో 40,000+ భారతీయులు ఉన్నారు. ఇలాంటి రెస్టారెంట్‌లు పెరుగుతున్నాయి. ఓనర్ "ఇండియా-జపాన్ ఫ్రెండ్‌షిప్"ను ప్రమోట్ చేస్తున్నారు.





















