Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ఐదుగురు జవాన్లు మృతి - ఇంటర్నెట్ బంద్
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
Jammu Kashmir Encounter:
రాజౌరిలో ఎన్‌కౌంటర్..
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 5గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను ఏరివేయాలనే లక్ష్యంతో నిత్యం నిఘా పెడుతోంది ఇండియన్ ఆర్మీ. నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్‌లు చేపడుతోంది. ఈ క్రమంలోనే రాజౌరిలోని కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందింది. మే 3వ తేదీన జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు జవాన్లు. ఓ ట్రక్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి ముష్కరులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినా...లాభం లేకుండా పోయింది. కాసేపటికే వాళ్లూ మృతి చెందారు. దీనికి బదులు తీర్చుకునేందుకు సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉగ్రకదలికలను గమనించిన ఆర్మీ...మొత్తానికి వాళ్ల స్థావరాన్ని కనుగొంది. ఓ గుహలో వాళ్లు దాక్కున్నట్టు గుర్తించింది. చుట్టూ కొండలు,గుట్టలు ఉన్నాయి. ఇంతలో సైనికుల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇరువైపులా ఎన్‌కౌంటర్ మొదలు కాగా...అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బాంబు దాడి చేశారు. ఈ బాంబు ధాటికి ఇద్దరు జవాన్లు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
J&K | Five soldiers lost their lives in the encounter ongoing in Kandi area of Rajouri. Senior officials have reached the spot.
— ANI (@ANI) May 5, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/3sIKz28Wus
ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నట్టు సమాచారం. ఈ అలజడితో రాజౌరిలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇటీవల పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఫలితంగా..ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం సరిగా లేదు. ఇదే అదనుగా ఉగ్రమూకలు ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేశాయి.
#WATCH | Jammu and Kashmir: Encounter underway between terrorists and security forces in Kesari hill area in Rajouri.
— ANI (@ANI) May 5, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/1clRZRJRnH
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వర్ జిల్లాలో ఆర్మీ చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మరణించాడు. ALH Dhruv హెలికాప్టర్ మర్వా ప్రాంతంలో కుప్ప కూలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్ప కూలింది. చాపర్‌ను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది జరిగిన సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే...ఇప్పుడు కశ్మీర్లో జరిగిన ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.