News
News
వీడియోలు ఆటలు
X

Modi Surname Case: రాహుల్‌కి జైలు శిక్ష వేసిన జడ్జ్‌కి ప్రమోషన్, సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

Modi Surname Case: రాహుల్‌ని దోషిగా తేల్చిన జడ్జ్‌కి పదోన్నతి ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

FOLLOW US: 
Share:

Modi Surname Case:

68 మంది జడ్జ్‌లకు ప్రమోషన్ 

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేసిన జడ్డ్‌కు పదోన్నతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆయనతో పాటు మొత్తం 68 మంది జడ్జ్‌లకు పదోన్నతినిచ్చారు. వీరిలో రాహుల్‌కు శిక్ష విధించిన హరీష్ హస్ముఖ్‌బాయ్ వర్మ కూడా ఉన్నారు. 65% కోటా ఆధారంగా వారికి పదోన్నతినిచ్చినట్టు ఇప్పటికే కోర్టు వెల్లడించింది. ఈ ప్రమోషన్స్‌పై సీనియర్ సివిల్ జడ్జ్ రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాపరాయ మెహతా అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ప్రమోషన్ లిస్ట్‌ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ, మెరిట్ ఆధారంగా కొత్త లిస్ట్‌ని తయారు చేయాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. సూరత్‌లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసు విచారణ జరిగింది. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ బీజేపీ నేత పిటిషన్‌తో ఇది వెలుగులోకి వచ్చింది. 2019లో ఈ కామెంట్స్ చేయగా...ఇటీవల ఆయనకు రెండేళ్ల జైలు శిక్షవిధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ జరిపింది హరీష్ హస్‌ముఖ్ బాయ్ వర్మ. అయితే...ఇప్పుడు ఆయనకు సూరత్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకి చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 8వ తేదీన ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. 

రాహుల్‌కి షాక్..

పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్  కోర్టు విధించిన 2 ఏళ్లు జైలు శిక్ష పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టులో వాదనలు జరిగాయి.  కేసుకు సంబంధించిన రికార్డులు, న్యాయవిచారణ క్రమాన్ని తమకు సమర్పించాలని సూరత్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ ఆదేశించారు. అదే సమయంలో వేసవి సెలవుల తర్వాతనే తాను ఈ అంశంపై తీర్పు ఇస్తానని.. స్పష్టం చేశారు. రాహుల్‌కు రిలీఫ్ ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. రాహుల్ గాంధీ ప్రజాప్రతినిధి అని, ఆయన ఏదైనా ప్రకటనలు చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట పరిమితులు లోబడి వ్యహరించాల్సి ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ అన్నారు. రాహుల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు.  తన క్లయింట్ హత్య వంటి ఎలాంటి ఘోర నేరానికి పాల్పడలేదని, ఎలాంటి నైతిక ప్రమాణాలను అతిక్రమించ లేదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ప్రాంతంలో పూర్ణేష్ మోదీ పిటిషన్ వేసి ఉండవచ్చని, అలా చేయకపోవడాన్ని కూడా అనుమానించాల్సి వస్తోందని సింఘ్వి వాదించారు.       

Also Read: The Kerala Story: కేరళ స్టోరీ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ,కాంగ్రెస్‌కు చురకలు

Published at : 05 May 2023 03:40 PM (IST) Tags: Supreme Court Rahul Gandhi Modi Surname Modi Surname Case Gujarat Court

సంబంధిత కథనాలు

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Governor Thamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల 

Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల