అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jadcherla News: పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మిన కన్న తండ్రి, రాత్రికి రాత్రే పట్టేసిన పోలీసులు

Mahabubnagar News: భార్య ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల విషయం బయటికి వచ్చింది.

Jadcherla Father Kidnapped and sold own children: డబ్బుపైన ఆశతో కన్న బిడ్డలనే కిడ్నాప్‌ చేసి ఓ తండ్రి అమ్మకానికి పెట్టాడు. భార్య ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల విషయం బయటికి వచ్చింది. వెంటనే పోలీసులు సకాలంలో స్పందించి అతణ్ని పట్టుకోవడంతో నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇలా కన్న బిడ్డలనే అమ్మాకానికి పెట్టిన ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని గౌరీ శంకర్ అనే కాలనీలో రఫీ కుటుంబం నివాసం ఉంటోంది. రఫీ కొంత కాలంగా తాగుడు, జూదానికి బానిస అయ్యాడు. కొద్ది నెలలుగా గోవా పర్యటనలు చేస్తూ అక్కడ ఫూటుగా తాగుతూ జల్సాలకు అలవాటయ్యాడు. ఇతనికి హబీబున్నిసాతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు మగపిల్లల సంతానంగా ఉన్నారు. ఇతను తరచు గోవా వెళుతూ అక్కడ అనేక చెడు వ్యసనాలకు బానిస అవడంతో పాటు ఇంకో వివాహం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తరచూ భార్యతో గొడవపడే వాడని తెలిపారు. 

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం తన పిల్లలకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పిన తండ్రి రఫీక్ తన పిల్లలు రుమానా బేగం (6) రమీజ్ (3) షోయబ్ (1.5) సంవత్సరాల చిన్నారులను తన బైక్ పైన ఎక్కించుకొని మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి గడిచినా వారు వెనక్కి రాకపోవడంతో భార్య హబీబున్నిస కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు నిందితుడు రఫిక్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లోని యాకుత్‌పురాలో అతని లోకేషన్‌ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. రఫీ వద్ద ముగ్గురు పిల్లలు లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ఆరా తీశారు. దీంతో తాను పిల్లల్ని మరో వ్యక్తి వద్ద ఉంచానని చెప్పడంతో అక్కడికి వెళ్లి పోలీసులు ఆరా తీశారు. ఓ వ్యక్తి వద్ద కారులో ముగ్గురు పిల్లలు ఉండడాన్ని గుర్తించారు.

పిల్లలు అక్కడ ఎందుకు ఉన్నారని పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నించగా.. రఫీక్ తనకు 9 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. అప్పటి వరకూ ఆ ముగ్గురు పిల్లలను తన వద్ద ఉంచుకోమని చెప్పారని వివరించారు. పోలీసులు పిల్లల్ని అర్ధరాత్రి క్షేమంగా పిల్లలను తల్లి వద్దకు చేర్చారు. సోమవారం ఉదయం పిల్లలను అమ్మకానికి పెట్టిన రఫిక్ ను కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. తన ముగ్గురు పిల్లలను రూ.9 లక్షలకు అమ్మకానికి పెట్టాడని రఫిక్ కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన జడ్చర్ల పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget