ITA Awards 2022: ABP న్యూస్ అరుదైన రికార్డ్- వరుసగా రెండో ఏడాది మోస్ట్ పాపులర్ ఛానల్‌గా!
ITA Awards 2022: 'మోస్ట్ పాపులర్ హిందీ న్యూస్ ఛానల్' అవార్డును వరుసగా రెండో ఏడాది ABP నెట్‌వర్క్ సాధించింది.
ITA Awards 2022: దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానల్ ABP న్యూస్.. అరుదైన రికార్డ్ నమోదు చేసింది. వరుసగా రెండో ఏడాది.. 'మోస్ట్ పాపులర్ హిందీ న్యూస్ ఛానల్' అవార్డును గెలుచుకుంది. ముంబయిలో జరిగిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) అవార్డుల కార్యక్రమంలో సగర్వరంగా ఈ అవార్డును ABP అందుకుంది. GR8 ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ & amp; మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శశి రంజన్, ప్రఖ్యాత నటి మహిమా చౌదరి ఈ అవార్డును అందజేశారు.
అంతేకాదు
ఈ అవార్డుతో పాటు ABP న్యూస్ యాంకర్లు రుబికా లియాఖత్, అఖిలేశ్ ఆనంద్ కూడా వ్యక్తిగత పురస్కారాలను గెలుచుకున్నారు. 'బెస్ట్ టాక్ / చాట్ షో' పేరుతో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రుబికా చేసిన ఇంటర్వ్యూకు ఈ అవార్డు వచ్చింది.
మరోవైపు అఖిలేశ్ ఆనంద్.. న్యూస్/ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన బెస్ట్ షోకు అవార్డు అందుకున్నారు. 'నీటి వ్యర్థాల నిర్వహణ'పై చేసిన ఎపిసోడ్‌కు గాను ఈ పురస్కారం దక్కింది. 22వ ITA అవార్డ్స్‌లో విభిన్నమైన, ప్రత్యేక ఎంట్రీలలో అత్యధిక అవార్డులు గెలిచిన ఏకైక వార్తా ఛానెల్‌గా ABP న్యూస్ రికార్డ్ సృష్టించింది. ఈ అవార్డు సాధించడంపై ABP నెట్‌వర్క్ CEO అవినాశ్ పాండే ఆనందం వ్యక్తం చేశారు.
చాలా ప్రత్యేకం
ITA అవార్డులు
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్‌ను ITA అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. భారత టెలివిజన్, ఓటీటీ & సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏడాది ITA ఈ అవార్డులను అందజేస్తుంది. దీనిని అను రంజన్, శశి రంజన్ స్థాపించారు. మొట్టమొదటి ITA అవార్డు వేడుక 2001, నవంబర్ 30న జరిగింది. గత రెండు దశాబ్దాలుగా ఈ అవార్డులను అందజేస్తుంది.
ABP నెట్‌వర్క్
ఒక వినూత్న మీడియా, కంటెంట్ క్రియేషన్ కంపెనీగా ABP నెట్‌వర్క్ విశ్వసనీయ పాత్ర పోషిస్తోంది. ప్రసారం & డిజిటల్ స్పియర్, మల్టీ లాంగ్వేజ్ వార్తా ఛానెల్‌లు, వెబ్‌సైట్‌ల రూపంలో ABP.. 535 మిలియన్ల మందికి న్యూస్ చేరవేస్తుంది. ABP నెట్‌వర్క్ అనేది ABP సంస్థల సమాహారం. దాదాపు 100 ఏళ్ల వైభవం ABP సొంతం.