అన్వేషించండి

Sasikala’s Properties Update: చిన్నమ్మకు ఐటీ శాఖ పెద్ద షాక్.. రూ.100 కోట్ల ఆస్తులు జప్తు

శశికళకు ఐటీశాఖ పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం.

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఆదాయపు పన్ను విభాగం అధికారులు పెద్ద షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్లు సమాచారం. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

అమ్మ సీఎంగా ఉన్నప్పుడు..

  • ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ దాదాపు రూ. 20లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
  • 2014లో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను 'ఆదాయానికి మించి ఆస్తులు'గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఐటీశాఖ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

జైలు శిక్ష..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. ఆమె మరణానంతరం అన్నాడీంకే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నాలు చేస్తోన్న సమయంలోనే అవినీతి కేసులో శిక్ష పడటంతో జైలుకెళ్లాల్సి వచ్చింది. అవినీతి కేసులో శశికళకు ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు. 

అనంతరం జరిగిన పరిణామాల్లో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరతారనే వార్తలు వినిపించినప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget