అన్వేషించండి

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ISRO Future Missions: ఈ ఏడాది ఫిబ్రవరి 10న మూడు పేలోడ్ లను ప్రయోగించగా SSLV సక్సెస్ అయింది. వచ్చే ఏడాది(2024)లో SSLV నుంచి మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. 

ISRO Latest News: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) త్వరలో స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(SSLV) ద్వారా మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ISRO వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం తెలిపింది. 2024లో ముఖ్యమైన ప్రయోగాల విషయంలో కేంద్రం రాజ్యసభకు పలు వివరాలు వెల్లడించింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 

వచ్చే ఏడాది ఇస్రో ప్రయోగాలు..
2024లో ఇస్రో చేపట్టే మొత్తం ప్రయోగాలు -10
PSLV ద్వారా చేపట్టే ప్రయోగాలు -6
GSLV ద్వారా ప్రయోగాలు -3
లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ప్రయోగం -1
మొత్తం కలిపి వచ్చే ఏడాది ఇస్రో 10 ప్రయోగాలు చేపట్టబోతున్నట్టు కేంద్రం తెలిపింది. 

ఇస్రో 2024లో PSLV ద్వారా నింగిలోకి పంపాలని అనుకుంటున్న 6 ఉపగ్రహాల్లో అన్నిరకాల శాటిలైట్లు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన, భూ పరిశీలన ఉపగ్రహాలు, సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడే 2 ఉపగ్రహాలు, 2 వాణిజ్య ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. ఇక  GSLV ద్వారా ఇస్రో 3 ప్రయోగాలు చేపట్టాలనుకుంటోంది. వాతావరణ శాస్త్ర ఉపగ్రహం, నేవిగేషన్‌ శాటిలైట్‌, నాసా- ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న సింథటిక్‌ అపెర్చర్‌ రేడార్‌ (SAR) ఉపగ్రహాలను GSLV ద్వారా నింగిలోకి పంపించబోతు్నారు. వీటితోపాటు పునర్వినియోగ వాహక నౌక ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టబోతోంది. రెండు పునర్వినియోగ వాహక నౌకలతో వచ్చే ఏడాది ప్రయోగాలు చేస్తుంది ఇస్రో. ఇక జిశాట్‌ 20 ఉపగ్రహాన్ని కూడా ఇస్రో వచ్చే కక్ష్యలో ప్రవేశపెడుతుంది. 

ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో అతి ఎక్కువ విజయశాతం ఉన్నవి PSLV  ప్రయోగాలు. PSLV ఇస్రోకు నమ్మినబంటు. PSLV, GSLV తోపాటు.. తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టేందుకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (SSLV)ని కూడా ఇస్రో రూపొందించింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన రెండు ప్రయోగాలు జరిగాయి. అందులో ఒకటి విఫలం కాగా, మరొకటి విజయం సాధించింది. 2022 ఆగస్ట్ 7న రెండు పేలోడ్ లతో SSLV నింగిలోకి ఎగిరింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న మూడు పేలోడ్ లను ప్రయోగించగా SSLV సక్సెస్ అయింది. వచ్చే ఏడాది(2024)లో SSLV నుంచి మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. 

క్రూ ఎస్కేప్ సిస్టమ్ కోసం మరో ప్రయోగం..
ఈ ఏడాది అక్టోబర్ 21న క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను ధృవీకరించేందుకు ఇస్రో ఓ ప్రయోగం చేపట్టింది. అది విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది దీనికోసం మరో ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. 

క్రూ ఎస్కేప్ అంటే..?
వ్యోమగాములను రోదసిలోకి పంపేందుకు భారత్ గగన్‌యాన్‌ పేరుతో ప్రతిష్ఠాత్మక మిషన్‌ చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మానవ రహిత మిషన్ చేపట్టేందుకు ఇస్రో కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ ని నిర్ధారించుకునేందుకు ప్రయోగాలు చేపడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో గగన్‌ యాన్‌ లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ ను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ లో భాగంగానే ఈ ఏడాది అక్టోబర్ 21న చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. దీనికి కొనసాగింపుగా వచ్చే ఏడాది మరో ప్రయోగం చేపడతామంటోంది ఇస్రో. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget