Israel Ceasefire: కాల్పుల విరమణ, బంధీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం - రేపట్నుంచే అమల్లోకి
Ceasefire-Hostage Deal : ఇజ్రాయెల్ క్యాబినెట్ హమాస్‌తో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాన్ని ఆమోదించింది. ఇది ఆదివారం నుండి అమల్లోకి వస్తుంది.

Israel Ceasefire-Hostage Deal : ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి(Ceasefire-Hostage Deal) మార్గం సుగమమైంది. ఇజ్రాయెల్ కేబినేట్ హమాస్(Hamas)తో కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బందీల విడుదల ఒప్పందానికి ఆమోదం తెలిపింది. కాగా ఈ ఒప్పందం జనవరి 19 ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. గంటల తరబడి జరిగిన చర్చల అనంతరం అర్థరాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అన్ని ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ స్పష్టం చేసింది.
రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి యుద్ధం లక్ష్యాలను సాధించేందుకు ఇది ప్రయోజనకరమైని అర్థం చేసుకున్న తర్వాత ఈ ఒప్పందానికి ఆమోదించాలని సెక్యూరిటీ కేబినేట్(Securit Cabinet)ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అని అంతకుముందు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Natanyahu) కార్యాలయం ప్రకారం తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే కేబినేట్ దీనికి ఆమోదముద్ర వేసింది. మధ్యవర్తులు ఖతార్, యూఎస్, ఈజిప్ట్ ఈ ఒప్పందాన్ని ప్రకటించిన రెండు రోజుల తరువాత ఒప్పందం వివరాలను ఖరారు చేసినట్లు హమాస్ తెలిపింది. ఇక ఈ ఒప్పందానికి మెజారిటీ క్యాబినెట్ సభ్యులు తమ ఆమోదం తెలుపగా, ఇద్దరు తీవ్రవాద మంత్రులు, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్, ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇద్దరు మంత్రులు తమ పార్టీ మద్దతును పాలక సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకుంటామని, హమాస్‌పై యుద్ధాన్ని సమర్ధించారు.
Also Read : Hyderabad Metro: 13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
పూర్తి బాధ్యత వహించడానికి పాలస్తీనా సిద్ధం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని అనుసరించి, గాజాలో పూర్తి బాధ్యత వహించడానికి పాలస్తీనా సిద్ధంగా ఉందని పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్(Mahmoud Abbas) చెప్పారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దాంతో పాటు గాజాలో పూర్తి బాధ్యత వహించేందుకు పాలస్తీనా ప్రభుత్వం అన్ని సన్నాహాలను పూర్తి చేసిందని తెలిపారు. "గాజాలో కలిగిన జనాభా నష్టాన్ని తగ్గించడానికి, స్థానభ్రంశం చెందిన వ్యక్తులను వారి ఇళ్లకు తిరిగి రప్పించడానికి, అవసరమైన సేవలను పునరుద్ధరించడానికి, సరిహద్దు క్రాసింగ్‌ల వద్ద బాధ్యత వహించేందు, ప్రారంభించడానికి సహాయం చేయడానికి ప్రభుత్వ పరిపాలనా, భద్రతా సిబ్బంది తమ పనులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు" అని చెప్పారు.
బందీల కుటుంబాలకు సమాచారం
ఒప్పందంపై చర్చలు సఫలం కావడం, త్వరలోనే అమలు కానున్న నేపథ్యంలో బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా 95మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో 69మంది మహిళలు, 16మంది పురుషులు, 10మంది మైనర్లు ఉన్నారు. మరోవైపు ఒప్పందానికి మార్గం సుగమం కావడంతో గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read : 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం





















