Israel: ఇజ్రాయేల్‌లో 48 గంటల పాటు ఎమర్జెన్సీ,హెజ్బుల్లాపై ప్రతీకార దాడులు - అంతా విధ్వంసమే
Israel Hezbollah: ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులకు సై అంటూ ఇరు వర్గాలు సంచలన ప్రకటన చేశాయి.
Israel Hezbollah War: ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారీ స్థాయిలో దాడులు చేస్తామని రెండు వర్గాలు సంచలన ప్రకటనలు చేశాయి. ఇరాన్ మద్దతుతో హెజ్బుల్లా ఇజ్రాయేల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇజ్రాయేల్ మిలిటిరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం లెబనాన్ నుంచి నార్త్ ఇజ్రాయేల్‌పై దాదాపు 100 రాకెట్‌లు దూసుకుపోయాయి. ఈ దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయేల్ ఆర్మీ వెంటనే ప్రతిదాడులకు దిగింది. లెబనాన్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయేల్‌పై భారీ స్థాయిలో దాడులు చేస్తున్నందుకు ప్రతీకారంగా తామూ యుద్ధానికి సిద్ధమైనట్టు ఇజ్రాయేల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది.
డిఫెన్స్ మినిస్టర్ సంచలన ప్రకటన..
లెబనాన్ చేస్తున్న దాడులను న్యూట్రలైజ్ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కొద్ది వారాలుగా ఇజ్రాయేల్, హెజ్బుల్లా మధ్య ఇదే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే హెజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ని ఇజ్రాయేల్ మట్టుబెట్టింది. ఇందుకు ప్రతీకారంగానే ఇజ్రాయేల్‌పై యుద్ధం ప్రకటించింది హెజ్బుల్లా. ఇజ్రాయేల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ ఇప్పటికే ఓ సంచలన ప్రకటన చేశారు. వచ్చే 48 గంటల పాటు ఇజ్రాయేల్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు వెల్లడించారు. (Also Read: Kolkata: నిందితుడి మోచేతులు నడుముపై గాయాలు, ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా పెనుగులాడిందా?)
Hezbollah has just launched over 150 projectiles from Lebanon toward Israeli territory.
— Israel Defense Forces (@IDF) August 25, 2024
We target terrorist infrastructure, they target civilians.
"లెబనాన్‌పై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతున్నాం. ఇజ్రాయేల్ పౌరులపై దాడులు జరుగుతున్నట్టు గుర్తించాం. అందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నాం. బీరట్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. అక్కడి ఇజ్రాయేల్ పౌరుల రక్షణకు అన్ని విధాలుగా సహకరిస్తాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా తీవ్ర దాడులతో ప్రతిఘటిస్తాం"
- యోవ్ గల్లాంట్, ఇజ్రాయేల్ రక్షణ మంత్రి
“In a self-defense act to remove these threats, the IDF is striking terror targets in Lebanon, from which Hezbollah was planning to launch their attacks on Israeli civilians.”
— Israel Defense Forces (@IDF) August 25, 2024
Listen to an update from IDF Spokesperson, RAdm. Daniel Hagari, regarding Hezbollah’s plans to attack… pic.twitter.com/fKvbUVSmbT
బెంజమిన్ ఉన్నత స్థాయి సమావేశం..
ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే.. ఈ భేటీ ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం రహస్యంగా ఉంచారు. ఇజ్రాయేల్ ఇప్పటికే 40 మిజైల్స్‌తో దాడులు చేసింది. వెంటనే దాడులు ఆపకపోతే మరింత తీవ్రం చేస్తామని హెజ్బుల్లాకి వార్నింగ్ ఇచ్చింది.