Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే
Isha Ambani: ముకేశ్ అంబానీ, నితా అంబానీ మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
Isha Ambani:
ఘన స్వాగతం..
ఇశా అంబానీ, ఆనంద్ పిరమళ్ దంపతులకు నవంబర్ 19 న కవలలు జన్మించారు. లాస్ ఏంజెల్స్‌లో డెలివరీ అయ్యాక తొలిసారి ఇండియాకు వచ్చిన ఇశా అంబానీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఇద్దరు శిశువులు జన్మించి నెల రోజులు అవుతున్న సందర్భంగా...ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికారు. కరుణ సింధు, అంటిల్లా రెసిడెన్స్‌లను అందంగా అలంకరించారు. ఇద్దరు కవలల్లో ఒకరు మగ శిశువు కాగా మరొకరు ఆడ శిశువు. వీరికి కృష్ణ, ఆద్య అని పేరు పెట్టారు. వీళ్లు ముంబయికి
వచ్చేందుకు ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఎమిరేట్స్‌తో అంబానీకి సత్సంబంధాలున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ వల్లే ఇలా స్పెషల్ ఫ్లైట్‌ను పంపింది. అత్యంత నిపుణులైన వైద్యులు నితా అంబానీతో పాటు విమానంలో ముంబయి వరకూ ప్రయాణించారు. అమెరికాలోనే బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గిబ్సన్ కూడా వీరితో పాటు ఉన్నారు. శిశువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్లంతా నిత్యం పర్యవేక్షించారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న అమెరికన్ నర్స్‌లూ వీరితో పాటు ఉన్నారు. కరుణ సింధు రెసిడెన్సీ వద్ద కోలాహలం నెలకొంది. నితా అంబానీ నేరుగా ఇక్కడికే రానున్నారు. రేపు (డిసెంబర్ 25న) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెద్ద మొత్తంలో విరాళాలూ ఇస్తారట. శిశువులను ఆశీర్వదించేందుకు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు చెందిన పూజారులను పిలిపించింది అంబానీ కుటుంబం. పిల్లల బట్టల కోసం మూడు కాస్ట్లీ బ్రాండ్ కంపెనీల డిజైనరీ వేర్స్ బిడ్ వేశాయి.
300 కిలోల బంగారం దానం..
View this post on Instagram
View this post on Instagram
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..అంబానీ ఫ్యామిలీ ఈ సంతోష సమయంలో 300 కిలోల బంగారాన్ని దానం చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల నుంచి క్యాటరర్‌లను పిలిపించారు. రుచికరమైన వంటలతో పాటు భారత్‌లోనూ ప్రముఖ ఆలయాలైన తిరుపతి బాలాజీ, నాథ్‌ద్వారా శ్రీనాథ్ జీ,శ్రీ ద్వారకాధీశ్ టెంపుల్స్ నుంచి ప్రసాదాలూ తెప్పిస్తున్నారు. ఇక తమ మనవడు, మనవరాలి కోసం ముకేశ్, నితా అంబానీలు స్పెషల్ అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. రొటేటింగ్ బెడ్స్, ఆటోమేటెడ్ రూఫ్ టాప్స్ ఇందులో ఉన్నాయి.