Conjoined Twins: సౌదీలో అరుదైన శస్త్రచికిత్స, అవిభక్త కవలల్ని వేరు చేసిన వైద్యులు - 11 గంటల పాటు సర్జరీ
Conjoined Twins: సౌదీలో అవిభక్త కవలల్ని 11 గంటల పాటు సర్జరీ చేసి వేరు చేశారు.
Conjoined Twins in Saudi Arabia:
27 మంది వైద్యుల శ్రమ..
ఇరాక్‌కు చెందిన ఇద్దరు అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ చేసి వేరు చేశారు వైద్యులు. దాదాపు 11 గంటల పాటు 27 మంది వైద్యులు శ్రమించి ఈ సర్జరీని విజయవంతం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. స్పెషలిస్ట్‌లు, నర్సులు, టెక్నికల్ స్టాఫ్..ఇలా అంత మంది కష్టపడితే కానీ ఆ సర్జరీ పూర్తి కాలేదు. ఈ ఇద్దరు చిన్నారుల కాలేయం, పొత్తి కడుపు అతుక్కునిపోయాయి. చాలా సున్నితమైన సర్జరీని...కింగ్ సాల్మన్ ఆదేశాలతో పూర్తి చేశారు వైద్యులు. Saudi Conjoined Twins Programలో భాగంగా సౌదీ అరేబియాలో ఇలాంటి సర్జరీలు చేస్తుంటారు. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 127 మంది అవిభక్త కవలల్ని విడదీశారు. 32 ఏళ్లుగా ఈ సేవలందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు చిన్నారులూ ఆరోగ్యంగా ఉన్నారు. కింగ్ అబ్దుల్లా స్పెషలైజ్డ్ ఆసుపత్రిలో దాదాపు ఆరు దశలుగా ఈ సర్జరీ చేశారు. అయితే ఈ సర్జరీని నేతృత్వం వహించిన వైద్యుడు కీలక విషయం వెల్లడించారు. ఆపరేషన్ 70% మాత్రమే సక్సెస్ అయిందని చెప్పారు. చాలా వరకు అవయవాలు అతుక్కుపోయాయని అన్నారు. ఈ సర్జరీని పూర్తి చేసిన వైద్యులకు థాంక్స్ చెప్పారు. హెల్త్ సెక్టార్లో అభివృద్ధి సాధిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కవలలను సౌదీకి తీసుకొచ్చారు.
بدء عملية فصل التوأم السيامي العراقي "على وعمر".https://t.co/id61fUkPca#واس_عام pic.twitter.com/NFL0UGNe3t
— واس العام (@SPAregions) January 12, 2023
బ్రెజిల్లో...
వీణావాణీలలాగే తలలు కలిసి జన్మించారు ఇద్దరు అన్నదమ్ములు. వారిది బ్రెజిల్. వయసు మూడేళ్లు. వారిద్దరినీ విడదీసేందుకు ఎంతో కష్టపడ్డారు వైద్యులు. దాదాపు వివిధ దేశాల్లోని వందమంది వైద్యులు వర్చువల్ పద్ధతిలో కలిసి ఆపరేషన్ మొత్తాన్ని పూర్తిచేశారు. బ్రెజిల్ లోని రియో డి జనరేరియోలోని ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నేరుగా శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులతో లండన్,ఇతర దేశాల్లోని వైద్యులు వర్చువల్ పద్ధతిలో కలిశారు. లండన్ వైద్యుల వర్చువల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ సాగింది. ఈ శస్త్రచికిత్స చేసినంత కాలం వైద్యులు చెవులకు హెడ్ సెట్ పెట్టుకునే ఉన్నారు. దాదాపు 27 గంటల పాటూ ఆపరేషన్ సాగింది. ఆ ఇద్దరి కవల అన్నదమ్ముల పేర్లు బెర్నార్డో, ఆర్ధర్ లీమా. తల, తలలోని మెదడు కూడా కలిసిపోయి పుట్టారు వీరిద్దరూ. ఓ స్వచ్ఛందసంస్థ సాయంతో వీరిద్దరినీ విడదీసేందుకు ముందుకు వచ్చారు బ్రెజిల్ వైద్యులు. 27 గంటల పాటూ సాగిన శస్త్ర చికిత్సలో వైద్యులు కేవలం ఆహారం తినేందుకు పావు గంటసేపు మాత్రమే బ్రేక్ తీసుకునేవారు. శస్త్రచికిత్స చేస్తున్నంత కాలం పిల్లల రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని పరిశీలిస్తునే ఉన్నారు. ఆ రెండూ చాలా పెరిగిపోవడం వీరిని కలవరానికి గురి చేసింది. అయినా పిల్లలకు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు.
Also Read: MV Ganga Vilas Launch: గంగా విలాస్ క్రూజ్ స్పెషాల్టీస్ అన్నీ ఇన్నీ కావు, పేరుకు తగ్గట్టే విలాసం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets