అన్వేషించండి

Iran War Updates: పశ్చిమాసియాలో శాంతి సూచనలు - ఇరాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన వెనుక అసలు వ్యూహం ఏమిటి?

Iran proposes to stop war: ఇరాన్ యుద్ధం ముగించాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ఓ ప్రతిపాదనను అమెరికా, ఇజ్రాయెల్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Iran proposes to stop war: యుద్ధం కారణంగా   నిప్పుల కొలిమిలా మారిన పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం కొన్ని కీలక షరతులతో కూడిన  కాల్పుల విరమణ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ , అమెరికా మిత్రపక్షాల నుండి ఎదురవుతున్న తీవ్రమైన వైమానిక దాడులతో, ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుని చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.                     

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం, ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఉంటేనే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నట్లు  చెబుతున్నారు. ఒకటి..  ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు నిలిపివేయడం,  రెండు -  గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక ఆంక్షలను సడలించడం,  మూడు- లెబనాన్,  గాజాలో తక్షణ శాంతిని నెలకొల్పడం. ఈ షరతులను అమెరికా , ఇజ్రాయెల్ అంగీకరిస్తేనే ఇరాన్ తన క్షిపణి దాడులను పూర్తిగా నిలిపివేస్తుందని స్పష్టం చేసింది.                         

మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలకు  కీలక సందేశం పంపారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ప్రాంతీయ శాంతి కోసం సహకరించాలని ఆయన కోరారు. ఇది కేవలం ఇజ్రాయెల్‌తో యుద్ధం ఆపడమే కాకుండా, అరబ్ దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తన ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి , అంతర్జాతీయంగా ఒంటరి కాకుండా ఉండేందుకు ఈ  శాంతి మంత్రం జపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.                          

అయితే, అమెరికా , ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదనలను ఎంతవరకు నమ్ముతాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  ప్రస్తుత యంత్రాంగం కూడా ఇరాన్ మాటలను  కాలయాపన తంత్రం గా భావిస్తున్నారు. ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హిజ్బుల్లా, హౌతీలు  పూర్తిగా నియంత్రించకుండా కేవలం మాటలతో శాంతి సాధ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. దీంతో, ఇరాన్ ప్రతిపాదనపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

ఒకవేళ ఈ కాల్పుల విరమణ గనుక అమల్లోకి వస్తే, అది  అతిపెద్ద విజయం అవుతుంది. చమురు సరఫరా పునరుద్ధరణతో పాటు, గల్ఫ్‌లో చిక్కుకున్న  వారి భద్రతకు గ్యారెంటీ లభిస్తుంది. ముఖ్యంగా సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతినే ముప్పు తప్పడం వల్ల డిజిటల్ కనెక్టివిటీ,  అంతర్జాతీయ వాణిజ్యం యధావిధిగా కొనసాగుతాయి. రాబోయే 48 గంటల్లో ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగే చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు
Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget