అన్వేషించండి

Inter Supply Results: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌, ఇక్కడ చూసుకోండి!

ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జ‌న‌ర‌ల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, వోకేష‌న‌ల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణత సాధించారు

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో కార్యద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జ‌న‌ర‌ల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, వోకేష‌న‌ల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. జ‌న‌ర‌ల్ కోర్సు ప‌రీక్షల‌కు 2,20,456 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,49,285 మంది పాస‌య్యారు. వొకేష‌న్ కోర్సు ప‌రీక్ష‌ల‌కు 18,955 మంది హాజ‌రు కాగా, 10,858 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.


ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌లైన‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 65.07శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది.

 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

 

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరయ్యారు

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు,  మే 7 నుంచి 24వ వరకు  సెంకడ్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యూలర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఆగస్టు నెలాఖరులో విడుదల చేయనున్నారు.

 

Also Read:

HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్‌-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

Also Read:

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Captain Brook Record:  కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డు.. లంక‌పై వీర‌విహారంతో అరుదైన ఘ‌న‌త‌
కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డు.. లంక‌పై వీర‌విహారంతో అరుదైన ఘ‌న‌త‌
ABP Desam Top 10, 16 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 16 September 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
WPL Fifth Edition: కొచ్చి వేదికగా అక్టోబర్‌లో మెగా ఆక్షన్ నిర్వ‌హ‌ణ‌.. డబ్ల్యూపీఎల్ 2027 తేదీలు ఖరారు 
కొచ్చి వేదికగా అక్టోబర్‌లో మెగా ఆక్షన్ నిర్వ‌హ‌ణ‌.. డబ్ల్యూపీఎల్ 2027 తేదీలు ఖరారు 
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget