ILBS: ఐఎల్‌బీఎస్‌లో 260 ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 260
1) సీనియర్ ప్రొఫెసర్
2) ప్రొఫెసర్
3) అడిషనల్ ప్రొఫెసర్
4) అసోసియేట్ ప్రొఫెసర్
5) అసిస్టెంట్ ప్రొఫెసర్
6) కన్సల్టెంట్
7) డిప్యూటీ హెడ్ ఆపరేషన్స్
8) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్
9) బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్
10) రీడర్
11) మేనేజర్
12) డిప్యూటీ మేనేజర్
13) అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)
14) సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్
15) ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్
16) ఎగ్జిక్యూటివ్
17) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ)
18) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (నర్స్)
19) జూనియర్ నర్స్
20) సీనియర్ రెసిడెంట్
21) జూనియర్ రెసిడెంట్
22) ఎగ్జిక్యూటివ్ (నర్స్)
విభాగాలు: అనస్థీషియా/రేడియేషన్ ఆంకాలజీ/ మాలిక్యులర్ సెల్యులార్ మెడిసిన్, ఎపిడెమియాలజీ/పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్/మెడికల్ ఆంకాలజీ, క్రిటికల్/ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్/ హెపటాలజీ/ నెఫ్రాలజీ/ ట్రాన్స్ ఫ్యూజన్, మెడిసిన్, యూరాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 10+2/ డిప్లొమా/డిగ్రీ/ బీఎస్సీ నర్సింగ్/ ఎంబీబీఎస్ / ఎండీ/ ఎంఎస్ / డీఎన్‌బీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30-70 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.590.
దరఖాస్తు చివరితేది: 28.02.2023.
Notification & Online Application
Also Read:
తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..