Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, 20 మంది మృతి - మూడు నిముషాల పాటు కంపించిన బిల్డింగ్‌లు
Indonesia Earthquake: ఇండోనేషియా రాజధాని జకార్తా భూమి తీవ్రంగా కంపించి 20 మంది మృతి చెందారు.
Indonesia Earthquake:
సౌత్ జకార్తాలో భూకంపం..
ఇండోనేషియా రాజధాని జకార్తాలో భూమి తీవ్రంగా కంపించింది. ఈ ధాటికి 20 మంది మృతి చెందగా..300 మంది గాయపడ్డారు. రిక్టార్ స్కేల్‌పై 5.4గా దీని తీవ్రత నమోదైంది. సౌత్ జకార్తాల్లోని నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది. "రిక్టర్ స్కేల్‌పై 5.4గా భూకంప తీవ్రత నమోదైంది. సౌత్ జకార్తాలోని నగరాల్లో భూమి కంపించింది" అని AFP న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. యూఎశ్ జియోలాజికల్ సర్వే ప్రకారం...వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సినాజుర్ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. 10 కిలోమీటర్ల లోతు వరకూ దీని తీవ్రత నమోదైందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయి. గ్రేటర్ జకార్తా ప్రాంత ప్రజలు ఈ ధాటికి భయంతో వణికిపోయారు. ఎత్తైన భవనాలు దాదాపు మూడు నిముషాల పాటు కంపించాయి. అప్పటికప్పుడు ఆ భవనాల్లోని వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. "భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని మేమంతా పరుగులు పెట్టాం" అని ఓ ఉద్యోగి వెల్లడించారు.
#BREAKING Earthquake shakes buildings in Indonesian capital: @AFP pic.twitter.com/1IRze7PrSi
— AFP News Agency (@AFP) November 21, 2022
#UPDATE Nearly 20 people have been killed and at least 300 injured in an earthquake that rattled Indonesia's main island of Java, local official tells the media.
— AFP News Agency (@AFP) November 21, 2022
"The information I got for now, in this hospital alone, nearly 20 died and at least 300 people are being treated" pic.twitter.com/G6H1sQ27sm
ఇండోనేషియాలో భూకంపాలు తరచుగా నమోదవుతూనే ఉంటాయి. సునామీలు, భూకంపాలకు కేంద్రంగా మారిపోయింది ఈ దేశం. గతేడాది డిసెంబర్‌లోనూ భారీ భూకంపం నమోదైంది. మొదట 7.6 తీవ్రత ఉన్నట్లు ప్రకటించారు. ఆపై భూకంప కేంద్రాన్నిగుర్తించి, తీవ్రతపై క్లారిటీ ఇచ్చారు. సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పసిఫిక్ మహాసముద్రంలో తరచుగా భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉందని జియాలాజికల్ సర్వే అధికారులు హెచ్చరిస్తుంటారు. గతంలో 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం అనంతరం సునామీగా మారి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం జకార్తాలో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంఖ్య 40కి పైగానే ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.
Also Read: Twitter Layoffs: ట్విటర్లో కొనసాగనున్న లేఆఫ్‌లు, ఈ సారి ఆ ఉద్యోగులకు ఎసరు