INS Mormugao: భారత నేవీలోకి మరో పవర్‌ఫుల్ వార్‌షిప్, డ్రాగన్ తోక ముడవాల్సిందే
INS Mormugao: భారత నేవీలోకి అత్యంత శక్తిమంతమైన యుద్ధ నౌక INS Mormugao అందుబాటులోకి వచ్చింది.
Indian Navy Commissions INS Mormugao:
INS Mormugao
భారత నేవీలోకి మరో శక్తిమంతమైన INS ప్రవేశించింది. P15B స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ INS Mormugaoను ప్రవేశ పెట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఇండియన్ నేవీలోకి ఇది అందుబాటులోకి వచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత నేవీ చరిత్రలో ఇదే మైలు రాయి అని నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ స్పష్టం చేశారు. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌక..
వార్‌షిప్ డిజైన్, అభివృద్ధి విషయంలో భారత్ ఎంత పురోగతి సాధించిందనటానికి సాక్ష్యం అని అభిప్రాయపడ్డారు. యుద్ధ నౌకలకు ప్రముఖ నగరాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు. సముద్ర జలాల సంరక్షణలో మరో ముందడుగు వేశామని చెప్పారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు...ఈ యుద్ధ నౌకలు గట్టి బదులు చెబుతాయని నేవీ భావిస్తోంది.
Mumbai | INS Mormugao, a P15B stealth-guided missile destroyer, commissioned into the Indian Navy in the presence of Defence Minister Rajnath Singh, CDS Gen Anil Chauhan, Navy chief Admiral R Hari Kumar and other dignitaries. pic.twitter.com/JukEG1kdgl
— ANI (@ANI) December 18, 2022
Mumbai | Today is yet another milestone in the history of indigenous warship building as we commission the destroyer Mormugao, particularly when our sister ship Visakhapatnam was inducted into the Indian Navy just over a year ago: Navy Chief Admiral R Hari Kumar pic.twitter.com/eGlIcQOfJE
— ANI (@ANI) December 18, 2022
This achievement is indicative of the large strides we have taken in warship design and building capability over the last decade. The Navy has a tradition of naming ships after cities which creates an enduring umbilical link between the two: Navy Chief Admiral R Hari Kumar pic.twitter.com/AkNL3X6MF5
— ANI (@ANI) December 18, 2022
ప్రత్యేకతలివే...
1. గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ సిటీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే...ఈ సిటీ పేరునే ఈ యుద్ధ నౌకకు(Mormugao P15B D67) పెట్టారు. గతేడాది డిసెంబర్ 19 నాటికి గోవా పోర్చుగీస్ నుంచి స్వాతంత్ర్యం పొంది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మొదటి సారి ఈ యుద్ధనౌకను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు.
2.భారత నేవీకి చెందిన Warship Design Bureau ఈ నౌకను డిజైన్ చేయగా...Mazagon Dock Shipbuilders Ltd సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ నౌకలో అత్యాధునిక సెన్సార్‌లు, రేడార్, వెపన్ సిస్టమ్స్ అమర్చారు. వీటి ద్వారా భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను క్షిపణుల ద్వారా నాశనం చేయొచ్చు. ఉపరితలం నుంచి గగనతలానికీ క్షిపణులను ప్రయోగించేందుకు వీలుంటుంది.
3.163 మీటర్ల పొడవు, 17 మీటర్లు వెడల్పుతో భారీగా కనిపిస్తుందీ నౌక. 7,400 టన్నుల బరువుతో భారత్‌లో తయారైన అతి శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఇందులో పవర్‌ఫుల్ గ్యాస్ టర్బైన్స్ కూడా ఉంటాయి. వేగంగా దూసుకుపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి.
4.న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్...ఇలా ఎలాంటి యుద్ధ వాతావరణంలోనైనా...శత్రు దేశంతో తలపడే సామర్థ్యం INS Mormugao సొంతం.