Worlds Largest Office: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం కంటే పెద్ద బిల్డింగ్ నిర్మాణం, భారత్ లో ఎక్కడుందో తెలుసా?
Worlds Largest Office: పెంటగాన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా పరిగణిస్తారు. అంతకంటే పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఇప్పుడు మన దేశంలోనే కట్టారు. ఎక్కడో తెలుసా?
Worlds Largest Office: వరల్డ్ ట్రేడ్ సెంటర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఆల్ ఖైదా విమాన దాడులతో దీని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసొచ్చింది. పెంటగాన్ ప్రాంతంలోని ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా పరిగణిస్తారు. అయితే పెంటగాన్ కంటే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ గా మన భారత దేశంలోనే భారీ భవంతిని నిర్మించారు. ఈ భారీ భవంతి ఎక్కడ ఉంది, అందులో కల్పించిన సౌకర్యాలు ఏంటి, పెంటగాన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కంటే ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వన్ స్టాప్ డెస్టినేషన్ సెంటర్
చాలా మంది వ్యాపారవేత్తలకు వాణిజ్యం అనగానే పెంటగాన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటరే గుర్తుకువస్తుంది. వాస్తవానికి పెంటగాన్ కంటే కూడా దుబాయ్, అబుదాటి వంటి దేశాల్లో అత్యున్నత సౌకర్యాలతో, అత్యాధునిక టెక్నాలజీతో, ఆకాశాన్ని తాకేలా వాణిజ్య సంస్థలను నిర్మించినప్పటికీ.. వాటికి పెంటగాన్ ట్రేడ్ సెంటర్ కు వచ్చినంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరుండటం, చాలా ఏళ్ల క్రితం నిర్మించిన భవంతి కావడంతో పెంటగాన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు మంచి పేరు ఉంది. అయితే ఇప్పుడు భారత్ లో నిర్మించిన భవనం పెంటగాన్ ను కూడా తలదన్నేలా నిర్మించారు. గుజరాత్ లోని సూరత్ లో.. సూరత్ డైమండ్ బోర్స్ పేరుతో ఈ వాణిజ్య కేంద్రాన్ని నిర్మించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు, కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. గుజరాత్ లోని సూరత్ లో నిర్మించిన అతిపెద్ద వాణిజ్య కేంద్రం మరిన్ని సదుపాయాలతో, సౌకర్యాలతో, ఆధునికతతో నిర్మించారు. ఈ సూరత్ డైమండ్ బోర్స్ బిల్డింగ్ ను ఈ ఏడాది నవంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వజ్రాల ట్రేడింగ్ సెంటర్ ను ఈ భనంలో నిర్వహిస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు గుజరాత్ రాష్ట్రం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అందుకే సూరత్ ను ప్రపంచ రత్నాల రాజధానిగా పిలుస్తారు. సుమారు 65 వేల మంది ఏకకాలంలో ఇందులో పని చేస్తారు. దీనిని వన్ స్టాప్ డెస్టినేషన్ ఔట్‌లెట్ గా తీర్చిదిద్దారు.
35 ఎకరాల్లో, 15 అంతస్తులతో నిర్మాణం
ఈ వాణిజ్య కేంద్రాన్ని 35 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల మేర నిర్మించారు. ఇందులో మొత్తం 9 టవర్లు ఉంటాయి. ప్రతి టవర్ ను ఒకదానితో మరొకటి అనుసంధానించేలా నిర్మించారు. విశాలమైన సముదాయం కలిగిన ఈ భవనంలో 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఉంటుంది. ఈ భవనాన్ని ఈ ఏడాదిలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని కేవలం 4 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ఈ సముదాయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీ క్రియేషనల్ జోన్, పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
కంపెనీల చట్టం 2013లోని సెక్షన్-8 కింద ఈ భారీ భవనాన్ని రిజిస్టర్ చేయించారు. సూరత్ డైమండ్ బోర్స్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవనం అందుబాటులోకి వస్తే ముంబైకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వజ్రాలకు సంబంధించిన ప్రతి దశనూ ఇక్కడే పూర్తి చేయవచ్చు. ఈ భవనంలో అత్యాధునిక సదుపాయాలు కల్పించినట్లు గుజరాత్ డైమండ్ బోర్స్ సీఈవో మహేష్ గాధవి తెలిపారు. దేశంలోని వజ్రాల వ్యాపారంలో 90 శాతం సూరత్ లో జరుగుతోందని, ఇక పై ఆ 10 శాతం కూడా సూరత్ నుంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
View this post on Instagram