Operation Sindoor Lady Officers: "ఆపరేషన్ సిందూర్ " పేరే ఎందుకు? ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తుంది ఇద్దరు స్త్రీలు అని మీకు తెలుసా
Colonel Sophia Qureshi | పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన దాడులకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తున్నది ఇద్దరు మహిళా ఆఫీసర్లు కావడం విశేషం.

ఇండియన్ సైన్యం గర్జించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు ఒక్కొక్కటిగా లేచిపోతున్నాయి.POK ను స్థావరంగా చేసుకుని పహల్ గామ్ లాంటి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద మూకల శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్కు " సిందూర్ " అని పేరు పెట్టడం వెనుక ముఖ్యమైన కారణమే ఉంది
పరమ శివుడు స్వయంగా పార్వతి నుదుట దిద్దిన "సింధూరం "
భారత పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడు తొలిసారిగా సింధూరాన్ని పార్వతీ దేవి నుదిటిన దిద్దాడు. అప్పటినుంచి భారతీయులకు ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలకు సింధూరం భర్త పట్ల వాళ్లకున్న విధేయత, గౌరవానికి చిహ్నంగా మారితే భర్తలకు భార్య పట్ల ఉన్న బాధ్యతను సూచిస్తుంది. పెహల్ గామ్ దాడి లో అలాంటి భారతీయ స్త్రీ ల నుదిటిన ఉండే సింధూరాన్ని అన్యాయంగా తొలగించేసిన ఉగ్రవాదులను వేటాడడం కోసం మొదలుపెట్టిన ఈ ఆపరేషన్కు "సిందూర్ " అనే పేరు పెట్టింది భారత ప్రభుత్వం.
రాజపుత్ర వీర మహిళల ఆనవాయితీ "సింధూరం "
సాధారణంగా భారతీయ హిందూ మహిళలు సింధూరాన్ని తమ వివాహ బంధానికి గుర్తుగా ధరిస్తూ వస్తే మధ్యయుగాల్లో రాజపుత్ర వీరుల భార్యలు తమ భర్తలు యుద్ధానికి వెళ్లే ముందు వారితో తమ నుదుటను సింధూరం పెట్టించుకునేవారు. అలా చేస్తే తమ భర్తలు యుద్ధంలో గెలిచి వస్తారని వారి నమ్మకం. యుద్ధంలో సాహసానికి త్యాగానికి గుర్తుగా సింధూరాన్ని వారు భావిస్తారు కాబట్టి ఆ రెండూ కలగలిసిన ప్రస్తుత ఆర్మీ ఆపరేషన్కు "సిందూర్ " అనే పేరు పెట్టారు.
ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు వీర మహిళలు
ఈ ప్రతిష్టాత్మక "ఆపరేషన్ సిందూర్ " కు ఇద్దరు వీర మహిళలు నాయకత్వం లో పాలు పంచుకుంటున్నారు. వారే వింగ్ కమాందర్ వ్యామిక సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి.
వింగ్ కమాందర్ వ్యామిక సింగ్:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హెలికాప్టర్ పైలెట్ గా వింగ్ కమాండర్ వ్యామిక సింగ్ సేవలు అందిస్తున్నారు. NCC లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే భారత్ సైన్యం లో పనిచేయాలని నిర్ణయించుకుని ఇంజనీరింగ్ చదువుతూనే పర్మినెంట్ కమిషన్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్సులో 18 డిసెంబర్ 2019లో చేరారు. సింధూర్ ఆపరేషన్ పై ఆమె బ్రీఫింగ్ ఇస్తూ " ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి అని పాకిస్తాన్ సైన్య శిబిరాలపై తాము టార్గెట్ చేయడం లేదని ఒకవేళ పాకిస్తాన్ సైన్యం కనుక తమకు అడ్డు తగిలితే కచ్చితంగా వారికి సమాధానం చెప్పేందుకు అన్ని విధాలుగా ప్రిపేర్డ్ గా ఉన్నామని " స్పష్టం చేసారు.
కల్నల్ సోఫియా ఖురేషి
సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ లోని అత్యంత సీనియర్, ఓ మహిళా అధికారి. ఇండియన్ ఆర్మీ లోని కార్ప్స అఫ్ సిగ్నల్స్ వింగ్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలటరీ. సామర్ధ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారి ఆమె. "సింధూర్ " పై బ్రీఫింగ్ ఇస్తూ " పక్కా ఇంటిలిజెంట్ సమాచారం తో 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై దాడి చేసామని అయితే ఎక్కడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదని తెలిపారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అంతం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం" అని ఆమె అన్నారు.
మహిళల శక్తి తెలిపేందుకే "సిందూర్"
మొత్తం 24 మిస్సైల్ దాడులతో ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టిన ఆపరేషన్ సిందూర్ కు కీలక బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఇద్దరు మహిళా అధికారులకు ఇవ్వడం.. ఈ ఆపరేషన్కు సిందూర్ అనే పేరు పెట్టడం వెనుక " ఎలాంటి ఉగ్రవాదు దాడులు జరిగినా భారతీయులు ముఖ్యంగా భారతీయ మహిళలు భయపడరని తిరిగి శక్తివంతంగా జవాబు చెబుతామని " ఉగ్రవాద మూకలకు సమాధానం చెప్పడమే అసలైన వ్యూహం అని భద్రతా రంగ నిపుణులు చెప్తున్నారు. కాగా, భారత మహిళల నుదుట సిందూరాన్ని తుడిచేలా పాక్ ఉగ్రవాదులు చేపట్టిన దాడి కనుక ప్రతికార దాడికి ఆపరేష్ సిందూరం అని పేరు పెట్టారన్న అభిప్రాయం ఉంది.





















