India Airstrikes Pakistan: కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ తీసుకున్న బేస్ క్యాంపులు బద్దలయ్యాయి- కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
భారత సైన్యం కల్నల్ సోఫియా ఖురేషి, ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 'సింధూర్' ఆపరేషన్ లోని చేపట్టిన తొలి దాడి గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Operation Sindoor | న్యూఢిల్లీ: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే) లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన దాడులను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం చేపట్టినట్లు కల్నల్ సోఫియా కురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో కలిసి సోషియా ఖురేషీ, వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో పాల్గొని ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించారు. ఈ వివరాలు తెలియజేయడానికి ముందు ఉన్నస్థాయి సమావేశం జరిగింది.
ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాకిస్తాన్, పీఓకేలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినట్లు వీడియో ఆధారాలు ప్రదర్శించారు. ఆన్‌బోర్డ్ టార్గెటింగ్ సిస్టమ్స్, డ్రోన్‌ల ద్వారా సేకరించిన ఫుటేజ్ లతొ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రసంస్థలకు అనుసంధానంగా ఉన్న శిబిరాలు సహా కీలక ఉగ్రవాద స్థావరాలపై ప్రత్యక్షంగా దాడులు చేసినట్లు నిర్ధారించారు.

ఇంటెలిజెన్స్ సాయంతో మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, వాటిలో తొమ్మిదింటిని లక్ష్య్ంగా చేసుకుని దాడులు చేశాం. మంగళవారం అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. భారత్ టార్గెట్ చేసిన ఉగ్రవాదుల స్థావరాలలో 2008లో ముంబయి దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్న శిబిరం ఉందని కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ఇది లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరం అని తెలిపారు.
#WATCH | Delhi | #OperationSindoor| Col. Sofiya Qureshi, while addressing the media, presents videos showing multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJK. pic.twitter.com/Ih21EklEe5
— ANI (@ANI) May 7, 2025
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్ ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించారు. "పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టి విజయవంతంగా ధ్వంసం చేశాం. పాక్ ప్రజలు, పాక్ ఆర్మీకి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను ఎంచుకున్నామని వ్యోమికా సింగ్ తెలిపారు.
#WATCH |Delhi | #OperationSindoor| Wing Commander Vyomika Singh says, "Operation Sindoor was launched by the Indian Armed Forces to deliver justice to the victims of the Pahalgam terror attack and their families. Nine terrorist camps were targeted and successfully destroyed...… pic.twitter.com/Gmw6WHrYVO
— ANI (@ANI) May 7, 2025
ఆపరేషన్ సింధూర్: ఉగ్రవాద స్థావరాలపై దాడులు
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున జైషే మహ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసింది. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దాంతో భారత ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాడుదల స్థావరాల సమచారాన్ని పక్కాగా సేకరించి దాడికి ప్లాన్ చేశాం.
భారత బలగాలు బహావల్‌పూర్, సియాల్‌కోట్, భింబర్, మురిడ్కే, తెహ్రా కలాన్, కోట్లి, ముజఫరాబాద్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. జెఎం, ఎల్‌ఈటీతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ శిబిరాలు, వాటి ఆపరేషనల్ బేస్‌లు ఉన్న ప్రాంతాలపై సైతం సైన్యం మెరుపు దాడి చేసి నాశనం చేసింది. అర్థరాత్రి సరిగ్గా 1.44 గంటలకు ఈ వైమానిక దాడులు పూర్తయ్యాయని, కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే ఆపరేషన్ పూర్తి చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
రక్షణ మంత్రిత్వ శాఖ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ చర్యలు తీసుకుందని.. అయితే ఎలాంటి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు, పౌక్ పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.






















