CHANCELLOR? Mamata Banerjee : గవర్నర్ ప్లేస్‌లో మమతా బెనర్జీ - కీలక బిల్లుకు ఆమోదం!
బెంగాల్‌లో అన్ని యూనివర్శిటీలకు ఇక మమతా బెనర్జీనే చాన్సలర్‌గా ఉంటారు. ఈ మేరకు బిల్లు ఆమోదించారు.
CHANCELLOR? Mamata Banerjee : వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న గవర్నర్ జగదీష్ ధన్‌కర్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్‌లోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ జగదీప్ ధన్‌కర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భర్తీ చేస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. బిజెపి శాసనసభ సభ్యుల వ్యతిరేకత మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. పశ్చిమబెంగాల్ యూనివర్శిటీ చట్టాల (సవరణ) బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు సభలో ప్రవేశపెట్టారు.సభ ఆమోదం తెలిపింది.
Mamata Banerjee To Replace Governor As Chancellor Of State-Run Universities, West Bengal Assembly Passes Bill.
— Ankush Purkait (@aitc_ankush) June 13, 2022
The bill was passed after 182 members voted in favour of the legislation and 40 against it in the 294-member Assembly.@MamataOfficial ❤️#MamataBanerjee #IWM pic.twitter.com/KS7eBk4kWR
'విశ్వభారతి సెంట్రల్ యూనివర్శిటీకి వైస్‌చాన్సలర్‌గా ప్రధాని మోడీ వ్యవహరిస్తుండగా.. రాష్ట్ర యూనివర్శిటీలకు చాన్సలర్‌గా మమతా ఉండకూడదా? అని తృణమూల్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మీరు పూంచీ కమిషన్ సిఫార్సులు పరిశీలించాలని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు. పలు సందర్భాల్లో ప్రస్తుత చాన్సలర్ అంటే గవర్నర్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించారని అన్నారు. కాగా, ఈ బిల్లుకు అనుకూలంగా 182 మంది ఓటు వేయగా... 40 మంది వ్యతిరేకించారు.
ఈ బిల్లుపై బిజెపి మండిపడింది. ప్రతిదీ కంట్రోల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, చాన్సలర్‌గా ముఖ్యమంత్రిని నియమించడం వల్ల రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యానికి దారి తీస్తుందని బిజెపి ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు.ఇక అన్ని వర్సిటీలకు చాన్స్లర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఈ బిల్లుతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఎక్కువవుతుందని బీజేపీ అంటోంది.
Kolkata | Education comes under the concurrent list. I will meet Governor next Monday on the issue & will request to send it to Delhi (for the consideration of the President): West Bengal LoP Suvendu Adhikari pic.twitter.com/oG2IlWqhll
— ANI (@ANI) June 13, 2022