Weather Update IMD: 5 రోజులు మీ ఇష్టం- ఒడియాలు, అప్పడాలు ఏదైనా ఓకే, ఆ తర్వాత మాత్రం!
Weather Update IMD: రానున్న 5 రోజుల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Weather Update IMD: కొద్ది రోజులుగా ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తాజాగా మరో 5 రోజుల పాటు ఎండలు ఇంకా మండిపోతాయని భారత వాతావారణ విభాగం ప్రకటించింది. తీవ్ర ఎండల కారణంగా రానున్న 5 రోజుల్లో కనీసం 5 రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Heat wave conditions over Northwest & Central India during next 5 days and over East India during next 3 days and abate thereafter.
— India Meteorological Department (@Indiametdept) April 28, 2022
Rain/Thunderstorm accompanied with lightning/gusty winds likely to continue over Northeast India. pic.twitter.com/Ymgi2eOU4B
45 డిగ్రీల పైనే
రాజస్థాన్, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉంటాయని తెలిపింది. మే నెల మొదటివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత వర్షాలకు అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కే జెనమణి పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ 45 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దిల్లీలో గురువారం గరిష్ఠంగా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను తాకే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
122 ఏళ్లలో
2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.
కార్మికులు
Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!