Wayanad News: కేరళలో కొండచరియలు మళ్లీ విరిగిపడతాయా? మరోసారి వరదలకు అవకాశమెంత?
Kerala News: కేరళ రాష్ట్రాన్ని ఊహించని ప్రళయం కారణంగా దేశ మొత్తం అయ్యో పాపం కేరళ అనే రీతిలో అతలాకుతలం చేసింది. చిన్నపాటి నిర్లక్ష్యం వందల సంఖ్యలో మృతులకు కారణమైంది. ప్రళయం వచ్చే అవకాశం మళ్లీ ఉందా?
Kerala Landslides news: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో వచ్చిన విపత్తును దేశ విపత్తుగా గుర్తించే తరహా జరిగిన ప్రమాదాన్ని ఇంకా ఎవరు మరిచిపోలేదు. అనుకోని విధంగా జరిగిన ప్రమాదంతో నాలుగు గ్రామాలు మ్యాప్ నుంచి కనిపించకుండా పోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం
వయనాడ్ జిల్లాలోని ఇరువన్ జింజి అనే కొండ పై చిన్నపాటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ జలపాతాలు, అక్కడి వాతావరణం కారణంగానే పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షిస్తుంది అనే ఒక కారణం నేడు 400 మందికి పైగా మరణానికి కారణమైంది.
కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇరువన్ జింజి అనే కొండ పై మట్టి చాల మెత్తగా మారింది. అక్కడ నివాసాలకు అనువైన ప్రాంతం కాదు అని కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు సందేశాలను ఇచ్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్థానిక రాజకీయ కోణంలో చూసి నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది అని కొందరు నాయకుల ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటి నుంచి దానిపై శ్రద్ధ తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులను కేరళ ప్రభుత్వం చెవి చూసేది కాదు.
ప్రమాదం పొంచి ఉందా..?
కేరళ వయనాడ్ జిల్లాలో నిత్యం వర్షాలు పడుతూ ఉంటుంది. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. వందల అడుగుల మేర బండరాళ్లు, మట్టి వరదలో వచ్చి గ్రామాల పై పడింది. దీంతో ప్రమాదం ఊహించని విధంగా ప్రకృతి ప్రకోపానికి బలైంది. ఇలాంటి ప్రమాదం ఇంకా ఉందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయ చర్యల్లో మునిగిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం దాంతో పాటు మిగిలిన కొండల నుండి మరోసారి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని గుర్తించి దాన్ని ఎలా నివారించాలనే దానిపై పరిశీలన చేసి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుణపాఠం
కేరళ ప్రమాదం అందరికి బాధ కలిగించింది. ఇలాంటి ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరగుకూడదు అని దేశ వ్యాప్తంగా ప్రజలు దేవుణ్ని ప్రార్ధించారు. ఇలాంటి వాటి నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కొండలు ఉన్నాయి. ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా యాత్రికులు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న వాటిని నిపుణుల చేత పరిశీలన చేయించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.