రైల్వే ప్యాంట్రీలోని ఆహార పదార్థాలపై ఎలుకలు, చూసి షాకైన ప్యాసింజర్ - వైరల్ వీడియో
Viral Video: ఓ రైల్‌లోని ప్యాంట్రీలోని ఫుడ్‌పై ఎలుకలు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video:
ప్యాంట్రీలో ఎలుకలు..
ఇండియన్ రైల్వేస్‌లో ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ప్యాసింజర్స్ పదేపదే కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. కానీ...క్వాలిటీలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కేవలం ఆహారంలోనే కాదు...రైల్వే ప్యాంట్రీల్లోనూ నాణ్యత మెయింటేన్ చేయడం లేదు. రైల్వే ప్యాంట్రీలో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి ఆహారా పదార్థాలపై నుంచి ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీసి పోస్ట్ చేశాడు. అక్టోబర్ 15న రైల్లో ప్రయాణించే సమయంలో ఈ వీడియో తీసినట్టు చెప్పాడు ఆ నెటిజన్. ఇలాంటి ఘటనలు చూసి రైల్వేపై గౌరవం పోతోందని అసహనం వ్యక్తం చేశాడు. రైల్ జర్నీపై ఉన్న ఇష్టంతో వీడియో తీస్తుంటే ఉన్నట్టుండి ఇలా ఎలుకలు కనిపించాయని పోస్ట్ చేశాడు.
"నేను రైళ్లలో నిత్యం ట్రావెల్ చేస్తూ ఉంటాను. ట్రైన్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. అక్టోబర్ 15న నేను ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు అంతా వీడియో తీయాలని అనుకున్నాను. అన్నిచోట్లా షూట్ చేస్తుంటే ప్యాంట్రీలో ఎలుకలు కనిపించాయి. దాదాపు 6-7 ఎలుకలు అక్కడి ఆహార పదార్థాలపై తిరిగాయి"
- ప్యాసింజర్
View this post on Instagram
స్పందించని సిబ్బంది..
రైల్వే పోలీస్ ఫోర్సెస్ (RPF)కి కంప్లెయింట్ ఇచ్చాడు ప్యాసింజర్. కానీ...ఊహించని రీతిలో బదులు వచ్చింది. రైల్వే ట్రాక్‌ల కింద చాలా ఎలుకలున్నాయని చెప్పింది. ఆ తరవాత అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్యాంట్రీ మేనేజర్ దగ్గరికీ వెళ్లాడు. కానీ...వాళ్ల సమాధానం మరింత అసహనానికి గురి చేసింది. "ఎలుకలుంటే మేమేం చేయగలం.." అని బదులిచ్చారు వాళ్లు. ఆ తరవాత IRCTC స్పందించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్యాంట్రీ కార్‌లను హైజీన్‌గా ఉంచాల్సిన బాధ్యత తమదే అని స్పష్టం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car.
— IRCTC (@IRCTCofficial) October 18, 2023
The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured.
Also Read: అమెరికాలో పాలస్తీనా మద్దతుదారుల నిరసనలు, వందలాది మంది అరెస్ట్