Viral News: కంపెనీ సీఈవోకి 48 గంటల్లో 3 వేల జాబ్ అప్లికేషన్‌లు, నిరుద్యోగం ఆ రేంజ్‌లో ఉంది మరి!
Viral News: ఓ కంపెనీలో వేకెన్సీలున్నాయని నోటిఫికేషన్ పెట్టగా 48 గంటల్లోనే 3వేల రెజ్యూమ్‌లు వచ్చాయి.
Viral News:
నిరుద్యోగం ఇలా ఉంది మరి..
మార్కెట్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఇంకెక్కడా ఉండదు. ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో కంపెనీ వెబ్‌సైట్‌లో ఓ జాబ్ నోటిఫికేషన్ పెట్టాడు. అలా పెట్టిన 48 గంటల్లోనే ఆయనకు 3 వేల రెజ్యూమ్‌లు వచ్చిపడ్డాయి. ఆ సీఈవో కార్తీక్ ట్విటర్‌లో ఈ పోస్ట్ పెట్టగా వైరల్ అయిపోయింది. ఈ స్థాయిలో జాబ్ అప్లికేషన్‌లు వస్తున్నాయంటే మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ట్వీట్ చేశాడు. Springworks కంపెనీని కార్తీక్ 2014లో ప్రారంభించాడు. హ్యూమన్ రీసోర్సెస్ సెక్టార్‌లో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే సంస్థ ఇది. ఈ ట్వీట్‌ని చూసిన నెటిజన్లు కామెంట్‌లలో ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. వీటికీ స్పందించాడు కార్తీక్. తన కంపెనీలో పలు వేకెన్సీలున్నాయని వెబ్‌సైట్‌లో పెట్టామని, ఇప్పటి వరకూ దాదాపు 13 వేల అప్లికేషన్‌లు వచ్చినట్టు చెప్పాడు. మరో హైలైట్ ఏంటంటే...ఇవి కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ పోస్టింగ్స్ వివరాలు పెట్టారు. మరే ఇతర జాబ్ పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేయలేదు. అయినా...వేల అప్లికేషన్‌లు వచ్చాయి. ఇక నెటిజన్లు "మీ కంపెనీలో ఏ వేకెన్సీలు ఉన్నాయ్" అని అడిగారు. వాళ్లందరికీ సమాధానాలిచ్చాడు ఆ కంపెనీ సీఈవో. రిమోట్ వర్క్ అని మెన్షన్ చేస్తేనే ఈ స్థాయిలో అప్లికేషన్‌లు వచ్చాయని, ఇక ఆన్‌సైట్ అంటే ఎన్ని అప్లికేషన్‌లు వచ్చేవో అని అన్నాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. "నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది యూత్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాలేజ్‌లో నేర్చుకున్న దానితో సంబంధం లేని జాబ్‌లు కూడా చేయడానికి రెడీ అయిపోతున్నారు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇవీ లెక్కలు..
నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ గణాంకాలు ఇలాంటి సవాలు తీవ్రతను పెంచుతూనే ఉంటాయి. ఇటీవలి డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ నెలలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతం దాటింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (Centre for Monitoring India Economy - CMIE) తాజా సమాచారం ప్రకారం, భారతదేశ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 8.11 శాతానికి పెరిగింది, ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్చి నెలలో నమోదైన 7.8 శాతం నుంచి ఇది పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మార్చిలోని 8.51 శాతం నుంచి ఏప్రిల్‌లో 9.8 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగం మార్చిలోని 7.47 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.34 శాతానికి స్వల్పంగా తగ్గింది. దేశంలో నిరుద్యోగం పెరిగినప్పటికీ, ఏప్రిల్‌లో భారతదేశ శ్రామిక శక్తి భాగస్వామ్యం (labour force participation) 2.55 కోట్లు పెరిగి 46.76 కోట్లకు చేరుకుంది, మొత్తం భాగస్వామ్య రేటు 41.98 శాతానికి పెరిగింది. లేబర్ పార్టిసిపేషన్ రేట్ అంటే, పని చేయడానికి అర్హులైన వ్యక్తుల సంఖ్యను సూచించే గణాంకం. మార్చి నెలలో దీని రేటు 39.77 శాతంగా ఉంది, ఏప్రిల్‌లో 41.98 శాతానికి పెరిగింది. అంటే, పని చేయగల వారి సంఖ్య ఒక్క నెలలోనే 2.55 కోట్లు పెరిగింది.
Also Read: Tomato Price Hike: టమాటా ధరల ఎఫెక్ట్ - నెల రోజుల్లోనే కోటీశ్వరులుగా మారుతున్న అన్నదాతలు