Vice President Wishes ABP : ప్రతి అక్షరం ప్రజాపక్షం కావాలి..!  "ఏబీపీ దేశం"కు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు..! 

తెలుగు మీడియా రంగంలోకి ప్రవేశించిన ఏబీపీ నెట్‌వర్క్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏబీపీ తెలుగు డిజిటల్ పోర్టల్ ప్రారంభమైన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు

FOLLOW US: 

తెలుగు డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన ఏబీపీ నెట్‌వర్క్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మీడియాకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు విశిష్టమైన బాధ్యతలు ఉన్నాయని ... రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో  సమాజం ఆకాంక్షలను ఎప్పటికప్పుడు పాలకులకు తెలియచేస్తూ.. సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఆకాంక్షించారు. భారత్‌లో మీడియా ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని.. నాటి ఎమర్జెన్సీ దగ్గర నుంచి నేటి కరోనా పరిస్థితుల వరకూ మీడియా నిర్వర్తించిన బాధ్యతను గుర్తు చేసి.. అభినందించారు. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశం పంపించారు. 

ప్రజల్లో జాతీయ  భావాన్ని ..సమాజం పట్ల పర్యావరణం పట్ల మరితం బాధ్యతను పెంపొందించడంలో మీడియా మరింత కృషి  చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్లో చైతన్యం కలిగించడం.. వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏబీపీకి పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఏబీపీ తెలుగు ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగాలని .. ప్రజాపక్షం వహిస్తూ.. సామాజిక పురోగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 
 ఉత్తరాది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఏబీపీ గ్రూప్ తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అడుగు పెడుతోందని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు గడ్డపై.. ఏబీపీ మరింత మెరుగ్గా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ... వ్యవస్థలకు మరితం జవాబుదారీతనం పెంచేలా.. మీడియా శక్తిని చూపించాలని ఆకాంక్షించారు.

దేశంలో ప్రముఖ న్యూస్ నెట్‌వర్క్‌గా ఉన్న ఏబీపీ జూలై ౩౦న తెలుగు మీడియా రంగంలో అడుగుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా డిజిటల్ వార్తా సేవలను ప్రారంభించింది. ప్రత్యేకమైన న్యూస్ వెబ్‌సైట్‌తో పాటు, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా తెలుగు వీక్షకులకు చేరువవుతోంది

Published at : 30 Jul 2021 02:00 AM (IST) Tags: abp network abp telugu abp desam VP venkayyanaidu telugu abp andhra and telangana

సంబంధిత కథనాలు

Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!

Agnipath Recruitment Scheme: 'అగ్నిపథ్‌'లో మహిళలకు 20 శాతం రిజర్వేషన్- ఇండియన్ నేవీ బంపర్ ఆఫర్!

SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్‌ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు

ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్‌ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు

Same Sex Marriage: ఆ ఇద్దరు మగాళ్లు ఒక్కటయ్యారు, ఘనంగా పెళ్లి చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ వద్ద లవ్ ప్రపోజ్

Same Sex Marriage: ఆ ఇద్దరు మగాళ్లు ఒక్కటయ్యారు, ఘనంగా పెళ్లి చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ వద్ద లవ్ ప్రపోజ్

Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్

Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Chiranjeevi Vs Balakrishna: దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!

Chiranjeevi Vs Balakrishna: దసరా బరిలో చిరు Vs బాలయ్య - బాక్సాఫీస్ షేక్!

RK Roja Comments: జనసేన జాకీలు విరిగిపోతున్నాయ్ - పవన్‌ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు

RK Roja Comments: జనసేన జాకీలు విరిగిపోతున్నాయ్ - పవన్‌ కల్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్లతో మాజీ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్, రేవంత్ లేకుండానే - చక్రం తిప్పుతున్నారా?

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్లతో మాజీ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్, రేవంత్ లేకుండానే - చక్రం తిప్పుతున్నారా?

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!

NPS Scheme: మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్‌పీఎస్‌ - ఈసారి రిస్క్‌కు సంబంధించి!!