Defence Ministry: కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే- CDSగా నరవాణే!
భారత నూతన సైన్యాధ్యక్షుడిగా త్వరలోనే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఏప్రిల్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో భారత కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టనున్నారు.
గత మూడు నెలల్లో పదవీ విరమణ చేసిన కొంతమంది ఉన్నతాధికారుల తరువాత సీనియర్‌గా లెఫ్టినెంట్ జనరల్ పాండే ఉన్నారు. ప్రస్తుత లెఫ్టినెంట్ జనరల్ రాజ్‌శుక్లా (ఏఆర్‌టీఆర్ఏసీ) ఈనెల 31న రిటైరవుతున్నారు. గత జనవరి 31న సీనియర్ మోస్ట్ అధికారులైన లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతీ, లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిలు పదవీ విరణణ చేశారు.
సీడీఎస్‌గా
ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఆ పదవిని జనరల్ నరవణే చేపట్టే అవకాశాలున్నాయి. గత ఏడాది డిసెంబర్ 8న విమానం కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ సిబ్బంది మృతి చెందారు
భారత నూతన సీఓఎస్‌సీ (చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ)గా సైన్యాధిపతి జనరల్ ముకుంద్ నరవాణే ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాలను సంయుక్తంగా ముందుకు నడిపించేందుకు నరవాణేకు అవకాశం ఇచ్చింది రక్షణశాఖ. సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో నరవాణేకు ఆ బాధ్యతలు అప్పగించారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ 2019లో ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన వారు సీఓఎస్‌సీకి ఛైర్మన్‌గా ఉండేవారు. సీడీఎస్ జనరల్ రావత్ మృతి చెందడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో నరవాణేను భర్తీ చేశారు.
ప్రమాదంలో..
2021 డిసెంబర్ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11 మంది అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడి ఆయన కూడా కన్నుమూశారు.
Also Read: Hottest March India: ఆ నెల చాలా హాట్ గురూ! 122 ఏళ్ల రికార్డ్ బద్దలు
Also Read: Pakistan No Trust Vote: చివరి బంతికి ఇమ్రాన్ ఖాన్ సిక్సర్- జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సై