UP Viral Video: చచ్చిపోతాం రా అని ఫ్రెండ్ వార్నింగ్ - నిమిషాల్లో ట్రక్కును ఢీకొట్టిన బీఎండబ్ల్యూ, నలుగురు దుర్మరణం
BMW Car Crash Viral Video: ప్రమాదంలో జరిగే నష్టం వల్ల జీవితాలు తలకిందులైన ఘటనలు ఉన్నాయి. చనిపోతామని తెలిసినా, నలుగురు యువకులు వేగాన్ని నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.
BMW Car Crash Viral Video: అతివేగం, నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోకపోయినా, ప్రమాదంలో జరిగే నష్టం వల్ల జీవితాలు తలకిందులైన ఘటనలు ఉన్నాయి. చనిపోతామని తెలిసినా, నలుగురు యువకులు వేగాన్ని నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బీఎండబ్ల్యూ కారు ఓ లారీ ట్రక్ ను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. చనిపోయే ముందు వారు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అసలేం జరిగిందంటే..
నలుగురు వ్యక్తులు బీఎండబ్ల్యూ కారులో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కానీ అతివేగం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు, లారీ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని ఆనంద్ ప్రకాశ్ (35), అఖిలేశ్ సింగ్ (35), దీపక్ కుమార్ (37), మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. చనిపోయే ముందు జరిగిన డిస్కషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరె 230 కిలోమీటర్ల వేగంతో కారు ఎందుకు నడుపుతున్నావు. ఇంకా వెళ్లాలని ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ నడుపుతున్న వ్యక్తికి సూచించాడు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారు వేగం ఒక్కసారిగా పెంచడంతో అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి అరె ఇంత వేగంగా వెళ్లవద్దురా. ఇలా వెళితే నలుగురం చచ్చిపోతాం రా అని చెబుతున్న మాటలు వీడియోలో వినవచ్చు.
What a waste of life!
— Aman Dwivedi (@amandwivedi48) October 17, 2022
Speed THRILLS, but KILLS.#BMW, running at 230 km/h, collides with truck on #PoorvanchalExpressway. All 4 youths killed. They were live-streaming it on Facebook.
Drive safe, people. Always keep in mind - 'Ghar pe koi intezaar kar raha hai'. pic.twitter.com/2M7CkuO9h5
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సుల్తాన్‌పుర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ, కంటెయినర్ ట్రక్కును ఢీకొట్టడంతో విషాదం జరిగింది. అయితే ప్రమాదం జరగడానికి ముందు బీఎండబ్ల్యూలో ప్రయాణిస్తున్న వారు ఫేక్ బుక్ లైవ్ లో ఉన్నారు. ఓ వ్యక్తి వేగంగా వెళ్లవద్దు.. నలుగురం చచ్చిపోతాం అనగా.. మరో వ్యక్తి ఇంకా వేగంగా వెళ్లు. మనం 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాలి అన్నాడు. దాంతో 200 దాటి గంటకు 230 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న తరువాత డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వేగాన్ని తగ్గించాడు. కానీ అందులోని ఓ వ్యక్తి వేగాన్ని తగ్గించవద్దు. తగ్గిస్తే మళ్లీ పికప్ అందుకోలేము, బ్రేకులు వేయవద్దు అన్నాడు. ఆ తరువాత కొంత సమయానికే ఊహించని విషాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.