UP MLC Election Result 2022: యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ - మోదీ ఇలాకాలో మాత్రం షాక్
యూపీలో జరిగిన ద్వైవార్షిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 36 చోట్ల ఎన్నికలు జరిగితే 33 చోట్ల గెలిచింది. కానీ ఓడిపోయిన స్థానం వారణాశి కావడం ఆ పార్టీకి షాక్ లాంటిదే.
ఉత్తరప్రదేశ్ శాసనమండలికి ( UP MLC Election ) జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్లీన్ ప్వీప్ ( BJP ) చేసింది. మొత్తం 36 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా బిజెపి 33 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ( SP ) ఒక్క స్థానం కూడా గెల్చుకోలేదు. మిగతా మూడు స్థానాలను ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఈ మూడింటిలో ప్రధాని నియోజకవర్గం వారణాశి ఉంది. ప్రధాని మోదీ ( PM Modi ) సొంత నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ బిజెపి అభ్యర్థి సుధామ పటేల్‌ను ఓడించారు. వారణాసి- చందౌలి, బధౌలీ ఎమ్మెల్సీ సీటు నుంచి అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, విజయం సాధించారు.
LPG ధరల్లో భారత్ నం.1, పెట్రోల్‌లో 3వ ర్యాంక్- బాదుడే బాదుడు, వీర బాదుడు!
ఇక ప్రతాప్‌గఢ్, అజంగఢ్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బిజెపి ఓటమి పాలైంది. రాజా భయ్యా ( Raja Bhayya ) సన్నిహితుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ బిజెపి అభ్యర్థి హరి ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. అజంగఢ్‌లో బిజెపి రెబల్ ఎమ్మెల్సీ యశ్వంత్ తన కుమారుడు విక్రాంత్ సింగ్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపారు. బిజెపి నుండి రకామాంత్ యాదవ్ పోటీలో నిలిచారు. రకామాంత్ పై యశ్వంత్ కుమారుడు విక్రాంత్ సింగ్ ( Vikrant Singh ) ఎమ్మెల్సీగా విజయం సాధించారు. వీరిద్దరూ ఇండిపెండెంట్ సభ్యులే.
జో బైడెన్ - ప్రధాని మోదీ వర్చువల్ భేటీ, బుచా హత్యలపై విచారణకు డిమాండ్
బీజేపీ విజయం సాధించిన స్థానాల్లో తొమ్మిది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ మనవడు రవిశంకర్ సింగ్ పప్పు కూడా ( Ravi sankar Singh ) బీజేపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివాదాస్పద డాక్టర్ కఫీల్ ఖాన్‌ను ( Kafeel Khan ) నిలబెట్టింది. గోరఖ్ పూర్‌లో ( Gorakhpur ) ఓ ఆస్పత్రిలో చిన్నారుల మరణానికి ఆయన కారణం అని ప్రభుత్వం ఆయనను చాలా కాలం పాటు జైల్లో పెట్టింది. తర్వాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో బలం పెంచుకున్న సమాజ్ వాదీ పార్టీ మండలిలో మాత్రం కోల్పోయింది.