UP CM Yogi: ఐదేళ్ల తర్వాత తల్లిని కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
UP CM Yogi: ఐదేళ్ల విరామం తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని కలుసుకున్నారు.
UP CM Yogi:
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల విరామం తర్వాత తన తల్లిని కలిశారు. ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనలో యోగి ఉన్నారు. ఈ సందర్భంగా పౌరి గర్హ్వాల్ జిల్లాలోని తన సొంతూరు పంచూరుకు యోగి వెళ్లారు.
Uttar Pradesh CM Yogi Adityanath met his mother at his village Panchur, in Pauri Garhwal District of Uttarakhand earlier today.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 3, 2022
(Pic: UP CM's Twitter account) pic.twitter.com/57P5mdxfgd
తన తల్లి సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. తన తల్లి కాళ్లకు యోగి నమస్కరించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. యోగి తన సొంతూరును 2017 ఫిబ్రవరిలో చివరిసారిగా సందర్శించారు.
భారీ విజయం
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేసింది.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ షురూ- మరి దరఖాస్తు చేసుకున్నారా?