ఇవాల్టి నుంచి ఆ సిమ్‌కార్డులు పని చేయవు.. మరి మీ మొబైల్ నెంబర్ ఆ లిస్ట్‌లో ఉందా
ఇవాల్టి నుంచి ధ్రువీకరణ లేకుండా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌లు వాడుతున్న వ్యక్తులకు చిక్కులు తప్పవు. ఆయా ఫోన్ నెంబర్ నుంచి అవుట్‌గోయింగ్ కాల్స్ నిలివేస్తున్నాయి టెలికాం కంపెనీలు.
మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. కొన్ని సిమ్‌లు ఇవాల్టి నుంటి డెడ్ అయిపోతాయి.
తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌లు కలిగి ఉన్న వ్యక్తులు తమ వివరాలను రీ వెరిఫై చేసుకోమని చెప్పింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. గతేడాది డిసెంబర్ 7న ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వెరిఫై చేసుకునేందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు ఇవాల్టితో ముగియనుంది. అంటే సిమ్ వెరిఫికేషన్ లేకుండా 9 కంటే ఎక్కువ SIMలు వాడుతున్న వ్యక్తుల నుంచి అవుట్‌గోయింగ్ కాల్‌లు నిలిపివేస్తారు.
వెరిఫికేషన్ లేకుండా 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్న వినియోగదారుల సిమ్ కార్డ్‌లకు అవుట్‌గోయింగ్ కాల్‌లను 30 రోజుల పాటు, ఇన్‌కమింగ్ కాల్‌లను 45 రోజులలోపు నిలిపివేయాలని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. 60 రోజుల్లోపు సిమ్‌ను పూర్తిగా నిలిపివేయాలని చెప్పింది.
జాగ్రన్ వెబ్‌సైట్ ప్రకారం అంతర్జాతీయ రోమింగ్ కోసం ఈ నియమాల్లో సడలింపు ఇచ్చారు. అంతర్జాతీయ రోమింగ్, జబ్బు పడిన వాళ్లకు, దివ్యాంగులకు ఈ సడలింపు వర్తిస్తుంది. వాళ్లకు అదనంగా మరో 30 రోజులు గడువు ఇస్తారు. ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెలీకమ్యూనికేషన్ శాఖ పేర్కొంది.
ఫిర్యాదుపై సమయాన్ని తగ్గించాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొంది టెలికమ్యూనికేషన్స్ విభాగం. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ తరపున లేదా బ్యాంక్ లేదా మరేదైనా ఆర్థిక సంస్థ తరపున ఓ మొబైల్ నంబర్‌పై ఫిర్యాదు వస్తే వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని ఆదేశించింది. ఫిర్యాదు వచ్చిన సిమ్‌ల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌ను 5 రోజుల్లో నిలిపివేయాలని సూచించింది. 10 రోజుల్లో. 15 రోజుల్లో సిమ్ సేవలు పూర్తిగా నిలిపివేయాలని పేర్కొంది.
ఎవరి వద్ద ఎన్ని సిమ్స్ ఉండాలి?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కొత్త నిబంధనల ప్రకారం, దేశ పౌరులు ఎవరైనా 9 సిమ్‌లు కలిగి ఉండవచ్చు. జమ్మూ కశ్మీర్‌తో సహా ఈశాన్య ప్రాంతాల్లో నివసించే వాళ్లు మాత్రం 6 సిమ్‌లు కలిగి ఉండొచ్చు. కొత్త రూల్స్ ప్రకారం ఒక పేరుతో 9 కంటే ఎక్కువ సిమ్‌లను కలిగి ఉండటం నేరం. ఆన్‌లైన్ మోసాలు, అసభ్యకరమైన సందేశాలు లాంటివి నివారించడానికి ఈ రూల్స్ తీసుకొచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది.
Also Read: Konchada Srinivas: ఆరోగ్య సమస్యలతో నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి
Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!