అన్వేషించండి

త్వరలోనే ఒకే దేశం ఒకే మతం అంటారేమో, బీజేపీపై తేజస్వీ యాదవ్ సెటైర్లు

One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నికపై కమిటీ వేయడంపై తేజస్వీ యాదవ్ సెటైర్లు వేశారు.

One Nation One Election: 

జమిలి ఎన్నికలపై అసహనం..

One Nation One Electionపై కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ ఓ నివేదిక ఇవ్వనుంది. అయితే...ఉన్నట్టుండి ఈ కమిటీ ఏర్పాటు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేవలం స్వలాభం కోసమే బీజేపీ ఈ కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నాయి. దీనిపై బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌ స్పందించారు. బీజేపీ మొత్తం దేశాన్నే నియంత్రించాలని చూస్తోందని మండి పడ్డారు. ఇప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ...రేపు ఒకే దేశం, ఒకే పార్టీ అంటుందని సెటైర్లు వేశారు. అంతకన్నా ముందు వన్ నేషన్, వన్ ఇన్‌కమ్ పాలసీ ప్రకటించి ఉంటే బాగుండేదని అన్నారు. 

"బీజేపీ దేశాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ అందుకోసమే. అయినా వీటి కన్నా ముందు వన్ నేషన్, వన్ ఇన్‌కమ్ పాలసీ ప్రకటించి ఉంటే బాగుండేది. దీని తరవాత వన్ నేషన్, వన్‌ పార్టీ అంటారు. ఆ తరవాత ఒకే దేశం, ఒకే నేత, ఒకే దేశం,ఒకే మతం అని రకరకాల నినాదాలు ఇస్తారు. ఇవన్నీ ఎందుకూ పనికిరాని నిర్ణయాలు"

- తేజస్వీ యాదవ్, బిహార్ డిప్యుటీ సీఎం

ముందస్తు ఎన్నికలు..? 

ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. బహుశా లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశముందని, అందుకోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఉండొచ్చని అన్నారు. 

"లోక్‌సభ ఎన్నికలు అనుకున్న దాని కన్నా ముందుగానే జరిగే అవకాశముంది. బహుశా ఇది ప్రకటించేందుకే కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందేమో. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగితే మేం మా కూటమి మరింత వేగంగా పని చేస్తుంది. బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంటుంది"

- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చర్చలు సఫలవంతంగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై బిల్ ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి.. కేవలం కమిటీ మాత్రమే వేశామని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అన్ని అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించిన తరవాతే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మరో రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1967వరకూ లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ విప్లవాత్మక నిర్ణయం అనే భావిస్తున్నాను."

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

Also Read: Tribal Woman: రాజస్థాన్‌లో ప్రభుత్వం ఉందా? గిరిజన మహిళ ఘటనపై జేపీ నడ్డా ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget