News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

పెళ్లైనప్పటి‌ నుండి అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవలు చివరికి ప్రాణం తీసేంత వరకూ దారి తీసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు మాత్రమే కాదు, స్థానికులు సైతం షాకయ్యారు.

FOLLOW US: 
Share:

తిరుపతి/చెన్నై : అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం చూస్తుంటాం. కానీ ఆ గొడవలు కొందరివి రోజుల్లోనే పరిష్కారం అయితే, మరికొందరి సమస్య ఏళ్ల తరబడి కొనసాగుతోంది. కానీ తమిళనాడులో ఓ అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవ చివరికి ప్రాణం తీసేంత వరకూ దారి తీసింది. అత్తను ప్లాన్ ప్రకారం ఎవరూ లేని సమయం చూసి మరి అత్త ఇంట్లో ప్రవేశించిన కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది, తీవ్ర గాయాలపాలైన అత్త చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు మాత్రమే కాదు, స్థానికులు సైతం షాకయ్యారు. కోడలు అలా ప్లాన్ చేసింది మరి.

అసలేం జరిగిందంటే.. 
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా, సీతాపల్పనల్లూరు సమీపంలోని తులుకార్కులం పంచాయతీ పరిధిలోని వడుకనపట్టి గ్రామానికి చెందిన షణ్ముగవేల్ (63), సీతారామ లక్ష్మి(58) దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల సుద్దమల్లి సమీపంలోని కొండానగర్‌లో కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించారు షణ్ముగవేల్, సీతారామలక్ష్మీ దంపతులు. వీరి కుమారుడు రామస్వామికి ఐదేళ్ళ కిందటే వివాహం చేశారు. రామస్వామి భార్య మహాలక్ష్మికి అత్త సీతారామలక్ష్మీకి మొదటి నుండి సఖ్యత ఉండేది కాదు. తరచూ వీరి మధ్య ఏదో విషయంలో గొడవ జరుగుతూ ఉండేది.‌ ఇరుగుపొరుగు వారు ఇద్దరికి నచ్చచెప్పేవారు. ఇలా తరచూ చిన్న చిన్న కారణాలతో‌ గొడవ పడుతూ ఇరుగుపొరుగు వారికే తలనొప్పిగా మారారు.‌

ఈ క్రమంలో‌ అత్తగారింట్లో‌ ఉండేందుకు ఇష్టపడని మహాలక్ష్మి దంపతులకి రామస్వామి తల్లిదండ్రులు నివాసం ఉంటున్న వెనుక‌ వైపే ఇళ్ళు కట్టించి ఇచ్చారు. కానీ మహాలక్ష్మీ ఏదోక కారణంతో తరచూ అత్త సీతారామలక్ష్మీతో గొడవ పడేది. ఈ క్రమంలో ఎలాగైనా అత్త సీతారామలక్ష్మీని హత్య చేయాలని ప్లాన్ చేసింది. తన ప్లాన్ ప్రకారం హెల్మెట్ ధరించిన మహాలక్ష్మీ మగవారి లాగా దుస్తులు ధరించి సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సీతారామలక్ష్మిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఆపై ఆమె మెడలోని ఐదు తులాల  బంగారు గొలుసును దోచుకెళ్ళింది. ఇది దొంగల పనిగా చిత్రించేలా కోడలు మాస్టర్ ప్లాన్ వేసింది.

కోడలు కర్రతో దాడి చేయడా సీతారామలక్ష్మీ గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి చేరుకునే లోపే కోడలు మహాలక్ష్మీ‌ అక్కడినుంచి పరార్ అయ్యింది. రక్తపు మడుగులో ఉన్న అత్తను చికిత్స నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీతాపల్ప నల్లూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి) రాధ హత్యాయత్నం కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనలో కోడలు మహాలక్ష్మి హస్తం ఉన్నట్లు గుర్తించి మహాలక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారించగా, విషయం మొత్తం బట్టబయలు అయ్యింది. మహాలక్ష్మీ చెప్పిన విషయాలకు పోలీసులే షాక్ అయ్యారు. దీంతో‌ నిందుతురాలిని అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతా రామలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది.

అత్త హత్యపై తమిళనాడు పోలీసులు ఏం చెప్పారంటే..?
రామస్వామికి పెళ్లయినప్పటి నుంచి అత్తగారు, కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇలా వారిద్దరి మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు షణ్ముగవేల్ నివాసం ఉంటున్న ఇంటి వెనుక భాగంలో రామస్వామి, మహాలక్ష్మి దంపతులకి కొత్త ఇల్లు కట్టించారు అత్తామామలు. అయితే మహాలక్ష్మి తన అత్తవారితో తరచూ గొడవలు పడుతుండేది. అప్పుడప్పుడు ఇరుగుపొరుగు వచ్చి సర్ది చెప్పేవారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం వీరి మధ్య మళ్లీ గొడవ జరగగా.. అత్తను హత్య చేయాలని, పైగా తనపై అనుమానం రాకుడదని మహాలక్ష్మి ప్లాన్ చేసింది. సోమవారం ఉదయం సీతారామలక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా హెల్మెట్ ధరించి ఇంట్లోకి వెళ్లిన మహాలక్ష్మి అత్తగారిపై కర్రతో విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచింది. అత్త కేకలు వేయడంతో అక్కడినుంచి పరారైంది కోడలు. ఇది దొంగల పనేనని నమ్మించేందుకు అత్త మెడలోని 5 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. దాడి చేసి చైన్ ఎత్తుకెళ్లింది మహాలక్ష్మి అని తేలింది. దొంగలు వృద్ధురాలిపై దాడి చేసినట్లు గ్రామస్థులు భావిస్తారని, తనపై అనుమానం రాదని మహాలక్ష్మి నాటకం ఆడినట్లు తేలింది. అనంతరం పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచి కోక్రాకుళం మహిళా జైలుకి తరలించారు.

Published at : 01 Jun 2023 01:05 AM (IST) Tags: Tamil Nadu Daughter in law Tirupati Crime News Telugu Tirunelveli

ఇవి కూడా చూడండి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

Ayodhya Ram Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ, ఆలయం ఎప్పటికి పూర్తవుతుందంటే?

Ayodhya Ram Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ, ఆలయం ఎప్పటికి పూర్తవుతుందంటే?

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు- ఇద్దరు మహిళలు, ఓ మైనర్ సహా ఆరుగురు అరెస్టు

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు- ఇద్దరు మహిళలు, ఓ మైనర్ సహా ఆరుగురు అరెస్టు

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?