అన్వేషించండి

Actor Sarath Kumar: తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన నటుడు శరత్ కుమార్

AISMK Merges In BJP: సీనియర్ నటుడు శరత్ కుమార్ తన పార్టీని ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

AISMK Merged In Bjp: పార్లమెంట్ ఎన్నికలలు సమీపిస్తున్న రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. కొన్ని పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్నాయి. చిన్నా చితకా పార్టీలు బీజేపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు బీజేపీలోకి విలీనం అవుతున్నాయి. తమిళనాడు(Tamilnadu)లో పట్టు సాధించాలన్న  లక్ష్యంతో ఉన్న కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కలిసి పోటీ చేసినా... దారుణమైన ఫలితాలను చవి చూసింది. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

పార్టీని బీజేపీలో విలీనం చేసిన శరత్ కుమార్
ఇప్పటికే దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ కుమార్ (Actor Sarath Kumar) తన పార్టీని ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో...పార్టీని బీజేపీలో కలిపేశారు శరత్ కుమార్. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని శరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని  కితాబిచ్చారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా అందిస్తున్నారని మోదీపై ప్రశంసలు కురిపించారు. 

డీఎంకే వయా అన్నాడీఎంకే...

1996లో రాజకీయాల్లో వచ్చారు శరత్ కుమార్. 1996లో డీఎంకేలో చేరిన ఆయన...2001లో రాజ్యసభ సభ్యుడిగా నియమించారు కరుణానిధి. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ రాంరాం చెప్పేశారు. సతీమణి రాధికతో కలిసి అన్నాడీఎంకేలో చేరినప్పటికీ.... ఎక్కువ రోజులు ఆ పార్టీలో  కొనసాగలేకపోయారు.

2007లో సొంత పార్టీ స్థాపించి శరత్ కుమార్

2007 ఆగస్టులో ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి పార్టీని స్థాపించారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా....ఆశించిన ఫలితాలను రాబట్టడంలో శరత్ కుమార్ విఫలమయ్యారు. తాజాగా తన పార్టీని భారతీయ జనతా పార్టీని విలీనం చేశారు. ఆ పార్టీ విజయం కోసం పని చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. పార్టీని బిజేపీలో విలీనం చేసిన శరత్ కుమార్...పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదంటే పార్టీ కోసం మాత్రమే పని చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తమిళ ప్రజలు బీజేపీని, ఆ పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తుంటే...శరత్ కుమార్ తన పార్టీ విలీనం చేయడాన్ని తప్పుపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget