SC Verdict: చైల్డ్ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
SC Landmark Verdict: ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడాన్ని నేరంగా పరిగణించాలన్న సుప్రీం కోర్టు.. మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం.. చట్ట సవరణలకు కేంద్రానికి సుప్రీం సూచన
SC Landmark Verdict: చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని చెబుతూ.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన డేటా వాడటాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. ఇకపై కోర్టులు ఆ పదాన్ని కూడా వాడొద్దని ఆదేశించింది. చట్టంలోనూ అవసరమైన మార్పులు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.
చైల్డ్ ఫోర్నోగ్రఫీ పేరును వేరే పదాలతో మారుస్తూలా చట్టంలో సవరణలకు సూచన:
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరంగా పరిగణించలేమంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సోమవారం సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం లేదా డౌన్‌లోడ్ చేయడం పోస్కో చట్టం సహా ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం కింద నేరాలే అవుతాయని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు చైల్డ్ ఫోర్నోగ్రఫీ పేరును చైల్డ్ సెక్సువల్లీ అబ్యూజ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ మెటీరియల్ అన్న పదంతో మార్పు చేయాలని ఈ మేరకు చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణలు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కోర్టులు కూడా ఇకపై చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దని ధర్మాసనం ఆదేశించింది. పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు, వాటిపై కేసుల నమోదు, సమాజం వ్యవహరిస్తున్న తీరు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు చైల్డ్ ఫోర్నోగ్రఫీ డెఫినిషన్‌ను చట్టాల్లో మారుస్తూ సవరణలు చేయాలని కోరింది. ప్రస్తుతానికి ఒక ఆర్డినెన్స్ తెచ్చినా ఫర్వాలేదని తెలిపింది సుప్రీంకోర్టు.
తమిళనాడులో ఓ 28 ఏళ్ల వ్యక్తి తన ఫోన్‌లో చిన్నారుల ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేయగా.. జనవరి 11న మద్రాసు న్యాయస్థానం పోస్కో చట్టం కింద ఇది నేరం కాదంటూ జనవరి 11న తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంలో సవాల్ చేయగా సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆ కేసు విషయంలో సెషన్స్ కోర్టు మళ్లీ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టవచ్చని తెలిపింది. ఇటీవల యువత ఈ తరహా ఫోర్నోగ్రఫీ చూడడానికి అలవాడు పడ్డారని.. వాళ్లని శిక్షించడం కంటే సమాజం వారిలో మార్పు తెచ్చే దిశగా కృషి చేయాలంటూ నాడు మద్రాస్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఫోక్సో, ఐటీ చట్టాలు చైల్డ్ ఫోర్నోగ్రఫీని చూడడం తప్పు అని ఎక్కడా పేర్కొన లేదని కాబట్టి ఆ చట్టాల కింద వారిని అరెస్టు చేసి శిక్షించడం సరికాదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ కోర్టుపై ఎన్‌జీఓలు, వివిధ చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ మేరకు మద్రాస్ హకోర్టు తీర్పును పక్కన పెట్టడమే కాక.. చట్టాల్లో చైల్డ్ ఫోర్నోగ్రఫీ డెఫినెషన్‌ను కూడా మార్చాలని.. అసలు ఆ పదం స్థానంలో చిన్నారులపై లైంగిక దాడులు మరియు ఎక్స్‌ప్లాయింటింగ్‌కు వాడే మెటీరియల్‌గా మార్చాలని కేంద్రానికి సూచించింది. సదరు యువకుడిపై ఫ్రెష్‌గా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సెషన్స్ కోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Also Read: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు