Supreme Court: మదర్సా చట్టంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్- యోగి ప్రభుత్వానికి బిగ్ షాక్
UP News: యూపీ మదర్సా చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మదర్సా చట్టంలో ఫాజిల్, కమీల్ వంటి డిగ్రీలు ఇచ్చే హక్కు మదర్సా బోర్డుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
![Supreme Court: మదర్సా చట్టంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్- యోగి ప్రభుత్వానికి బిగ్ షాక్ supreme court give verdict on up madrasa act overturned allahabad high court order big jolt yogi government Supreme Court: మదర్సా చట్టంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్- యోగి ప్రభుత్వానికి బిగ్ షాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/e20204f41779fdf675137423060204a91730790087808215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Supreme Court: 2004 ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. యూపీ మదర్సా చట్టం చెల్లుబాటవుతుందా లేదా చట్టవిరుద్ధమైనదా అన్న విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం (నవంబర్ 5) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి మదర్సాలను నియంత్రించడంలో రాష్ట్రానికి కీలకమైన పాత్ర ఉందని కోర్టు పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. 'ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004' రాజ్యాంగబద్ధమైనవేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని మార్చి 22న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంటూ తీర్పు చెప్పింది. అందులో చదివే వారిని సాధారణ పాఠశాలల్లో చేర్చుకోవాలని ఆదేశించింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
అలా చెప్పడం సరికాదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ విద్యను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో సిలబస్, విద్యార్థుల ఆరోగ్యం వంటి అనేక అంశాలు ఉన్నాయి. మదర్సాలు కూడా మతపరమైన విద్యను అందిస్తున్నాయని, అయితే వాటి ప్రధాన లక్ష్యం విద్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏ విద్యార్థిపై కూడా బలవంతంగా మతపరమైన విద్య రుద్దవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది.
యూపీ మదర్సా చట్టానికి సంబంధించి మదర్సా చట్టంలో ఫాజిల్, కమీల్ వంటి డిగ్రీలు ఇచ్చే హక్కును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది యూజీసీ చట్టానికి విరుద్ధమని తెలిపింది. దీన్ని తొలగించాలని ఆదేశించింది. డిగ్రీలను ప్రదానం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అయితే మిగిలిన చట్టం రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)