అన్వేషించండి

Supreme Court: శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత- మేం అంటే లెక్కలేదా? స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం 

Supreme Court: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హతపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శిండే, ఉద్ధవ్ వర్గాలకు చెందిన వారిపై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది.

Supreme Court: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హతపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శిండే, ఉద్ధవ్ వర్గాలకు చెందిన వారిపై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిగింది. ఈ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి చెప్పాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు చివరి అవకాశం ఇచ్చింది. త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రధాన న్యామూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంటూ.. టైమ్ షెడ్యూల్‌​తో తాము సంతృప్తి చెందలేదంది. 

దీనిపై సొలిసిటర్​ జనరల్ స్పందిస్తూ.. దసరా సెలవుల సమయంలో తాను వ్యక్తిగతంగా స్పీకర్​తో చర్చిస్తానని ​ చెప్పారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం అక్టోబర్​ 30కి వాయిదా వేసింది. అనర్హత పటిషన్లపై మహారాష్ట్ర స్పీకర్ రాహుల్​ నర్వేకర్ మంగళవారం స్పందించారు. సుప్రీం కోర్టులో విచారణ ముగిసిన తర్వాతే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అన్నారు. ఏ నిర్ణయం రాగ్యాంగ విరుద్ధం అవుతుందో అనే విషయాన్ని తాను తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. దీనిపై చర్చించి సుప్రీం కోర్టుకు త్వరలోనే తన నిర్ణయాన్ని సమర్పిస్తానన్నారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ నెల 13న విచారణ
ఎమ్మెల్యేల అనర్హతపై అక్టోబర్ 13న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్​ నర్వేకర్‌​పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండంటూ అత్యున్నత ధర్మాసనం మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన ధర్మాసనం షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా అలసత్వం వహిస్తున్నారు. 

స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
అసెంబ్లీ స్పీకర్‌ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిర్ణీత కాలవ్యవధిని ప్రకటించి చర్యల ప్రక్రియను ప్రారంభించాలని, తమ ఆదేశాలను అనుసరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్‌ బేఖాతరు చేయలేరని, సీజేఐ జస్టిస్‌ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబరు 18న ఆదేశించింది. అంతకుముందు జులైలో నోటీసు జారీ చేసింది.

సుప్రీం ఆదేశించినా స్పీకర్‌ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్‌ ప్రభు, ఎన్సీపీలోని శరద్‌ పవార్‌ మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాల వ్యవధి చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ హెచ్చరించారు.

స్పీకర్‌ ఇచ్చే కాల వ్యవధి సంతృప్తిగా లేకపోతే, ఉల్లంఘించడానికి వీల్లేని విధంగా మంగళవారం ఉత్తర్వులిస్తామని స్పష్టం చేశారు. జులై నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని, పురోగతి ఎందుకు లేదని ప్రశ్నించింది. న్యాయస్థానం హుందాతనాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న చంద్రచూడ్, స్పీకర్‌ కార్యాలయాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు ఉండాలని గతంలో సూచించామన్నారు. లేదంటే 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చే వాళ్లమని తెలిపారు. 

తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో జట్టు కట్టారు ఏక్ నాథ్ శిండే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా శిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు. మరాఠా వర్గానికి చెందిన ఏక్‌నాథ్‌ షిండే, 1980ల్లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లోక వచ్చారు. ఠాణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాణే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు అందుకున్నారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఠాణే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే లోక్‌సభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు ప్రకాశ్‌ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamAnant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP DesamAnant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP DesamAmeer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Pastor Praveen Kumar Death Case :పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
IPL 2025 PBKS VS LSG Result Update:  ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
IIT And IIM: దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలో ఉపాధ్యాయుల కొరత- పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు
దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలో ఉపాధ్యాయుల కొరత- పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు
Anakapalli News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష
Embed widget