News
News
X

Supreme Court: 'జరిగేది జరుగుతుంది, మేం అప్పుడే విచారిస్తాం'- శివసేన పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్య

Supreme Court: రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

FOLLOW US: 

Supreme Court: మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో శివసేన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని శివసేన అభ్యర్థించింది. అయితే ఈ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది.

" జరిగేది జరుగుతుంది.. కానీ ఈ పిటిషన్‌ను మాత్రం జులై 11న విచారిస్తాం. ఏం జరుగుతుందో మాకు తెలుసు. కానీ విధానాలకు అనుగుణంగా, అవి ఎలా అమలు అవుతున్నాయో చూడాలి.                                                       "
-సుప్రీం కోర్టు

ఈ పిటిషన్‌ను జులై 11న విచారించ‌నున్న‌ట్లు సుప్రీం కోర్టు వెల్ల‌డించింది. శివ‌సేన చీఫ్ విప్ సునిల్ ప్ర‌భు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ పిటిష‌న్‌ను విచారించింది.

ఇదీ జరిగింది

శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్నీ వదులుకున్నారు. బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని తేల్చుకున్న ఠాక్రే రాజీనామా చేశారు.

శాసనసభను గురువారం సమావేశపరిచి, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ.. ముఖ్యమంత్రి ఠాక్రేను ఆదేశించారు. దీనిపై శివసేన అప్పటికప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. గవర్నర్‌ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించి, అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని చెప్పింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణ కొనసాగించి రాత్రి 9.15 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. తీర్పును గౌరవిస్తున్నట్లు ఠాక్రే చెబుతూ.. పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు.

అనంతరం భాజపా మద్దతుతో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

Also Read: Ukraine Crisis: పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ

Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం- సీఎం స్టాలిన్‌తో యశ్వంత్ సిన్హా భేటీ

Published at : 01 Jul 2022 05:31 PM (IST) Tags: supreme court Shivsena Uddhav camp

సంబంధిత కథనాలు

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ

టాప్ స్టోరీస్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి