Sunil Bharti Mittal: సునీల్ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం, కింగ్ చార్లెస్ 3 చేతుల మీదుగా నైట్ హుడ్ పురస్కారం
Honorary Knighthood: భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్ (Sunil Bharti Mittal)కు అరుదైన గౌరవం దక్కింది.
Sunil Bharti Mittal Receives Honorary Knighthood: ఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్ (Sunil Bharti Mittal)కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం నైట్‌హుడ్ ఆయనను వరించింది. నైట్‌హుడ్ ఇచ్చి సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ ప్రభుత్వం సత్కరించింది. కింగ్ ఛార్లెస్ 3 చేతుల మీదుగా సునీల్ మిట్టల్ ఈ అవార్డును అందుకున్నారు. కింగ్ చార్లెస్ చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ భారతీ మిట్టల్ నిలిచారు.
నైట్ హుడ్ అందుకోవడంపై సునీల్ మిట్టల్
బ్రిటన్ ప్రభుత్వం పలు రంగాల్లో విశేష సేవలు అందించిన విదేశీ పౌరులను అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన నైట్ కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ అవార్డుతో గౌరవిస్తుంది. నైట్ హుడ్ అందుకోవడంపై సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం తనకు దక్కిన గౌరవం అన్నారు. యూకే, భారత్ మధ్య ఎన్నో ఏళ్ల నుంచి గుడ్ రిలేషన్ ఉందన్నారు. భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
Founder and Chairman of Bharti Enterprises, Sunil Bharti Mittal has become the first Indian citizen to be awarded Honorary Knighthood, the Knight Commander of the Most Excellent Order of the British Empire (KBE), by King Charles III.
— ANI (@ANI) February 28, 2024
The KBE is among the highest honours… pic.twitter.com/EBBtc5e9hT
సునీల్ భారతీ మిట్టల్ అందుకున్న అవార్డులు, పురస్కారాలు
సునీల్ మిట్టల్ సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో పద్మభూషణ్ తో సత్కరించింది. 2008లో GSM అసోసియేషన్ చైర్మన్ అవార్డు, 2006లో ఆసియా వ్యాపారవేత్త ఆఫ్ ది ఇయర్ ఫార్చ్యూన్ మ్యాగజైన్, టెలికాం పర్సన్ ఆఫ్ ది ఇయర్ వాయిస్ & డేటా మ్యాగజైన్ (ఇండియా), CEO ఆఫ్ ది ఇయర్, ఫ్రాస్ట్ మరియు సుల్లివన్ ఆసియా పసిఫిక్ ICT అవార్డులు అందుకున్నారు. 2005లో ఉత్తమ ఆసియా టెలికాం CEO టెలికాం అవార్డు వరించింది. ది ఆసియన్ అవార్డ్స్ లో ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సునీల్ భారతీ మిట్టల్ అందుకున్నారు.